NTV Telugu Site icon

Zhong Yang: చైనా ‘బ్యూటిఫుల్ గవర్నర్’కు 13 ఏళ్ల జైలు శిక్ష..

China Governor

China Governor

అక్రమంగా ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై చైనాలో ఓ మహిళా అధికారికి 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాకుండా.. 10 లక్షల యువాన్లు (సుమారు రూ. 1.18 కోట్లు) జరిమానా విధించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఝాంగ్ యాంగ్ గుయిజౌ కియానాన్ ప్రావిన్స్‌కు గవర్నర్‌గా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ)లో డిప్యూటీ సెక్రటరీగా కూడా పనిచేశారు. విశేషమేమిటంటే.. ఆమె అందం కారణంగా అక్కడి జనాలు ఇప్పటికీ ‘అందమైన గవర్నర్’ అని పిలుస్తారు. యాంగ్ 58 మంది మగ సహోద్యోగులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని.. దాదాపు 60 మిలియన్ యువాన్లు (రూ. 71,02,80,719) లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Read Also: Krithi Shetty: సాలిడ్ హిట్‌తో మలయాళ కెరీర్‌ను ప్రారంభించిన బేబమ్మ

ప్రస్తుతం జాంగ్ యాంగ్ వయసు 52 ఏళ్లు. ఆమె 22 ఏళ్ల వయస్సులో కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ఆ తర్వాత.. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (NPC)లో డిప్యూటీ స్థాయికి ఎదిగారు. ఆమె.. ఫ్రూట్ అండ్ అగ్రికల్చర్ అసోసియేషన్‌ను ప్రారంభించడానికి చాలా కష్టపడింది. దీని ద్వారా రైతులకు, నిరుపేద వృద్ధులకు సహాయం చేయడానికి డబ్బు ఖర్చు చేసింది. ఈ డాక్యుమెంటరీని Guizhou రేడియో, టెలివిజన్ అందించినప్పుడు అప్పుడు వివాదం తలెత్తింది. ఝాంగ్ పెద్ద ఎత్తున లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వ పెట్టుబడుల పేరుతో ఇష్టారాజ్యంగా కంపెనీలకు ఆకర్షణీయమైన డీల్స్ ఇచ్చినట్లు అభియోగాలు మోపబడ్డాయి.

Read Also: Noida: వెరీ లక్కీ.. కారు బైక్‌ను ఢీకొనడంతో ఎలివేటెడ్ పిల్లర్‌పై వచ్చి పడ్డ యువతి (వీడియో)

జాంగ్ యాంగ్ తనకు వ్యక్తిగత సంబంధాలు లేని కంపెనీలను విస్మరించిందని ఒక ప్రైవేట్ వ్యాపార యజమాని పేర్కొన్నారు. 2023లో గుయిజౌ ప్రావిన్షియల్ డిసిప్లిన్ ఇన్‌స్పెక్షన్ అండ్ సూపర్‌విజన్ అనే కమిటీ.. ఝాంగ్ చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు అనుమానించారు. అంతేకాకుండా.. ఆమె 58 మంది మగ జూనియర్ సహోద్యోగులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. జోంగ్ యాంగ్ ఓవర్ టైం పని.. వ్యాపార పర్యటనలు అనే నెపంతో వారితో చాలా సమయం గడిపింది. ఈ విషయం తెలియగానే పెద్ద దుమారం రేగింది. దీంతో ఆమెపై విచారణ చేపట్టారు.