China People: ప్రపంచ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. తాజాగా భారతదేశ జనాభా చైనాను దాటేసింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఇదే సమయంలో చైనా జనాభా పెరుగుదల రోజు రోజుకు క్షీణిస్తోంది. అందుకు అక్కడి యువత పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపకపోవడమే. 30 ఏండ్లు దాటినా పెండ్లి కానివారి ప్రసాదుల సంఖ్య పెరిగిపోతున్నదని ఆ దేశంలో ఓ సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడించింది.
Read Also: Nellore crime: నెల్లూరులో దారుణం…యువకుడిపై కత్తులతో దాడి
సోలోగా ఉండాలనుకుంటున్న యువత
నగరాల్లోని యువత సోలో బతుకును కోరుకుంటున్నారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంత యువత పెండ్లి మార్కెట్ నుంచి తొలగింపునకు గురయ్యాయరని చైనీస్ వెబ్‌సైట్ వీబో వెల్లడించింది. సర్వే ప్రకారం ఒంటరిగా బతకడం మంచిదేనన్న భావన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన నినాదమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువత 30ఏళ్లు దాటిన పెళ్లి ప్రయత్నాలే చేయడంలేదు. ఇదే సమయంలో మహిళలు పెండ్లి చేసుకోవాలనుకొంటున్నా వారికి సరైన జోడీ దొరకడం లేదు.
Read Also:AICC Plenary : సోనియాకి కృతజ్ఞతలు తెలుపనున్న కాంగ్రెస్ నేతలు
పెళ్లి కాని వారి సంఖ్య 40కోట్ల పైమాటే
చైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం 2022 నాటికి పెండ్లి కాని పెద్దవారి సంఖ్య 40 కోట్లకు చేరింది. మరోవైపు చైనాలో విడాకుల రేటు పెరుగుతోంది. ఉద్యోగం సాధించడం కష్టతరం కావడం, జీవన వ్యయం పెరగడం వల్ల ఒంటరిగా బతకాలని చాలామంది యువకులు భావిస్తున్నారు. మరోవైపు పెండ్లి చేసుకొన్న జంటలు పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపడం లేదు. విద్య ఖరీదైపోవడం, ఇంట్లో పెద్దలు, పిల్లలు ఉంటే బతుకు భారమవుతుందని భావించడమే ఇందుకు కారణం.
