NTV Telugu Site icon

Petrol Pump: 5వ అంతస్థులో పెట్రోల్ బంక్.. ఎలా వెళ్లాలి బాసూ

5th Floor Petrol Bunk

5th Floor Petrol Bunk

ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు కనబడతాయి. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఇలాంటి వింత ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఓ బిల్డింగ్ లోని 5వ అంతస్తులో పెట్రోల్ బంక్‌ ఏర్పాటు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకి ఈ భవనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను @TansuYegen అనే వినియోగదారు ట్విట్టర్‌ (ఎక్స్)లో షేర్ చేశారు. కోట్లాది మంది వినియోగదారులు ఈ వీడియోని చూశారు. ఈ భవనంలోని ఐదవ అంతస్తులో గల పెట్రోల్ బంక్‌ దగ్గరకు వెహికిల్స్ ను ఎలా వెళతారనే ప్రశ్న అందరిలో మెదులుతోంది.

Read Also: Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ పై ప్రారంభమైన వాదనలు

అయితే, మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ పెట్రోల్ బంక్‌ చైనాలోని చాంగ్‌కింగ్‌లో నిర్మించారు. పెట్రోలు బంక్‌కు వచ్చిన కొన్ని వాహనాల్లో ఇంధనం నింపుతున్న దృశ్యాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు. నిజానికి ఈ బిల్డింగ్ తక్కువ ఎత్తులోనే కట్టారు. ఇది కొండ ప్రాంతం కావడంతో భవనం దిగువ భాగంలో నిర్మించబడింది. దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ బిల్డింగ్ ఐదవ అంతస్తుకు వెనుక నుంచి మరో రోడ్డు మార్గం కనిపిస్తుంది. ఆ దారిగుండా వాహనదారులు సులభంగా పెట్రోల్‌ బంక్‌కు చేరుకుంటున్నారు. డ్రగన్ కంట్రీవాసుల ప్రతిభకు ఈ పెట్రోల్ బంక్‌ అద్భుతమైన ఉదాహరణ అని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు.

Read Also: Success Story: డ్రైవర్‌తో గొడవపడి ఓలా క్యాబ్ సర్వీస్ పెట్టాడు.. ఇప్పుడు నికర విలువ రూ. 11700 కోట్లు