Harsh Weather in China’s Suqian after Hits Violent Tornado: తూర్పు చైనాలోని సుకియాన్ నగరంలో ఓ టోర్నడో (శక్తివంతమైన సుడిగాలి) బీభత్సం సృష్టించింది. మంగళవారం ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసానికి దాదాపుగా 10 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సుడిగాలి కారణంగా వందలాది మంది ప్రజలు తాత్కాలికంగా తమ నివాసం మారారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం కూడా జరిగింది. టోర్నడో బీభత్సంకు విద్యుత్ తీగలకు మంటలు అంటుకోవడం, బైక్స్ మరియు కార్లు బోల్తా పడ్డాయి.
చైనా మీడియా నివేదికల ప్రకారం… జియాంగ్స్ ప్రావిన్స్‌లోని సుకియాన్ పట్టణంలో మంగళవారం టోర్నడో ఒక్కసారిగా విరుచుకుపడింది. మెల్లగా ప్రారంభమైన సుడిగాలి.. క్షణాల్లోనే వేగాన్ని అందుకొని సుకియాన్ పట్టణాన్ని చుట్టేసింది. భారీ శబ్దంతో వీచిన గాలికి ఇళ్ల పైకప్పులు ఎగిరి పోయాయి. శక్తివంతమైన సుడిగాలికి సుకియాన్ పట్టణ పరిస్థితి భయానకంగా మారింది.
Also Read: Andhra Pradesh: వినాయక మండపంలో విషాదం.. డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి
బలమైన సుడిగాలి ధాటికి సుకియాన్ పట్టణంలో 137 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దాదాపుగా 6 వేల మంది ప్రజలు తీవ్ర ప్రభావితమయ్యారు. వందల మంది వారి నివాసాలను తాత్కాలికంగా ఖాళీ చేసి వెళ్లారు. టోర్నడో విధ్వంసం అనంతరం వాహనాలు చెల్లచెదురుగా పడ్డాయి. ఇళ్లు రూపురేఖలు పూర్తిగా మారాయి. ఇళ్ల శకలాలు, వస్తువులు మీద పడడంతో కొందరు రోడ్లపైనే విగతజీవులుగా మారారు. టోర్నడో విధ్వంసానికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Large, deadly tornado in Suqian, Jiangsu Province this afternoon. Tornado likely moved directly through downtown, massive injuries and some fatalities reported. pic.twitter.com/vvKmTRlzZx
— Eric Wang (@Ericwang1101) September 19, 2023