NTV Telugu Site icon

US-China: జో బైడెన్ తో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

China Us

China Us

డ్రాగన్ కంట్రీ అధినేత జిన్ పింగ్ అగ్ర రాజ్యం అమెరికాకి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన కీలక చర్చలు జరిపేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే, జిన్‌పింగ్‌కు అమెరికా మంత్రులు, ఉన్నతాధికారులు సైనిక లాంఛనాలతో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఇక, అమెరికా- చైనా దేశాల మధ్య సంబంధాలు పతనం అవుతున్న వేళ జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Earthquake in Pakistan: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. నాలుగు రోజుల్లో రెండోసారి కంపించిన భూమి

ఇక, శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సుకు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్‌ వెళ్లారు. ఈ సమావేశం తర్వాత కాలిఫోర్నియాలో అమెరికా అధినేత జో బైడెన్‌- చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వై పాక్షిక సంబంధాలు, వాణిజ్యం, తైవాన్‌ అంశాలతో పాటు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలపై ఈ ఇద్దరు చర్చించనున్నట్లు తెలుస్తుంది.

Read Also: Sabitha Indra Reddy: ముగిసిన మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ఐటీ సోదాలు

అయితే, ఇవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాల రవాణాను ఎదుర్కోవడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, దక్షిణ చైనా సముద్రంలో అలజడులపై కూడా ఈ సమావేశంలో బైడెన్‌- జిన్‌పింగ్‌ చర్చలు జరపనున్నట్లు టాక్. ఇక, ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య యుద్ధం, ఉక్రెయిన్‌- రష్యా మధ్య దాడులపై కూడా ఇరువురు దేశాధినేతల భేటీలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి.. అపోహలను తొలగించుకునేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని అమెరికా- చైనా దేశాలు భావిస్తున్నాయి.