China On Relations With India: స్థిరమైన, బలమైన సంబంధాల వృద్ధి కోసం భారత్‌తో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. తాము భారత్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. చైనా-భారత్ సంబంధాల స్థిరమైన వృద్ధి కోసం భారత్ ముందుకు రావాలన్నారు. చైనా, భారత్ దౌత్య, సైనిక-మిలిటరీ మార్గాల ద్వారా చర్చలు సాగించాయని ఆయన వెల్లడించారు.
Gold Mine Collapse: కుప్పకూలిన బంగారు గని.. చిక్కుకున్న 18 మంది మైనర్లు
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య డిసెంబర్ 9న జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఘర్షణ తర్వాత భారత్-చైనా 17వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశాన్ని డిసెంబర్ 20న చైనా వైపున ఉన్న చుషుల్-మోల్డో సరిహద్దు సమావేశ స్థలంలో నిర్వహించి, భద్రతను కొనసాగించడానికి అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమ సెక్టార్‌లో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని ప్రకటన పేర్కొంది. ఇరు పక్షాలు సన్నిహితంగా ఉండేందుకు, మిలిటరీ, దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరపాలని, మిగిలిన సమస్యలపై పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని త్వరగా రూపొందించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయని విదేశాంగ శాఖ పేర్కొంది.