Chang’e 6: చైనా మరో ఘనత.. భూమి మీదకు జాబిల్లి ఆవలి వైపు నమూనాలు
- చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత
- ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలి వైపు నమూనాలు సేకరణ
- విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చిన చాంగే-6 వ్యోమనౌక
- ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతాల్లో సురక్షితంగా ల్యాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలి వైపు నమూనాలు సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకుని చాంగే-6 వ్యోమనౌక భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతాల్లో ఇది సురక్షితంగా ల్యాండ్ అయింది. మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. జూన్ 2న చంద్రుడి ఆవలి వైపున సౌత్ పోల్-అయిట్కిన్ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్లో సురక్షితంగా దిగింది. ఈ మిషన్ లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే నాలుగు భాగాలు ఉన్నాయి. జాబిల్లి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి దిగువన ఉన్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంది. అనంతరం వాటిని తీసుకుని భూమికి తీసుకొచ్చింది. చాంగే-6 వ్యోమనౌక తీసుకొచ్చిన నమూనాలను 2.5 మిలియన్ ఏళ్ల పురాతన అగ్ని పర్వత శిలలు కూడా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Read Also: Nokia 3210: భారత మార్కెట్లోకి ‘నోకియా 3210’ ఫోన్.. యూపీఐ, యూట్యూబ్ ఫీచర్స్ కూడా!
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఈ నమూనాలను అధ్యయనం చేస్తే.. చంద్రుడికి రెండు వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని విశ్వసంగా ఉన్నారు. చందమామకు సంబంధించిన ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తోంది. ఇవతలి భాగం నియర్ సైడ్ గా పేర్కొంటారు. రెండో భాగం ఫార్ సైడ్‌గా పిలుస్తారు. ఇప్పటి వరకూ అమెరికా, సోవియట్ యూనియన్ తో పాటు చైనా కూడా పలుమార్లు నియర్ సైడ్ నుంచి నమూనాలు సేకరించి భూమికి తీసుకొచ్చింది. అవతలి భాగం నుంచి మట్టి, శిథిలాలను తీసుకురావడం ఇదే తొలిసారి. చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా వేరుగా ఉంటాయని రిమోట్ సెన్సింగ్ పరిశోధనల్లో వెల్లడైంది. ఇవతలి భాగం ఒకింత చదునుగా ఉంటుంది. అవతలి ప్రాంతమంతా అంతరిక్ష శిలలు ఢీకొట్టడం వల్ల భారీ బిలాలు ఏర్పడ్డాయి. చంద్రుడి ఉపరితల మందం కూడా రెండు భాగాల్లో వేరుగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
Read Also: South Central Railway : భారీగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైళ్లు
- Tags
- china
- far side
- first
- lunar probe
- Moon
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!