Covid Vaccine: సూది అవసరం లేకుండానే నోటి ద్వారా తీసుకునే కొవిడ్-19 టీకా పంపిణీని చైనా షురూ చేసింది. చైనాలోని షాంఘై నగరంలో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ తరహా వ్యాక్సిన్ ప్రపంచంలో మొదటిదని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్‌లకు కేవలం ఇంజక్షన్ ద్వారానే తీసుకునే వీలుండగా.. తొలిసారి నోటి ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌తో మరో ముందడుగు పడింది.
Dera Baba: డేరా బాబా మరో సంచలనం.. అలాంటి దుర్మార్గుడికి పెరోల్ ఇవ్వొద్దు
ఈ వ్యాక్సిన్‌లోని లిక్విడ్‌ను నోటితో పీల్చిన అనంతరం 5సెకన్ల పాటు ఊపిరి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ 20 సెకండ్లలో పూర్తవుతుంది. దీనిని బూస్టర్ డోస్‌గా భావిస్తున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు. ఇంజక్షన్ ద్వారా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇష్టపడని వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. సూదితో కంటే ఇది సులభంగా అందజేయవచ్చన్నారు. నోటి ద్వారా తీసుకోవడం వల్ల శ్వాస మార్గాల్లోకి వెళ్లకముందే కరోనా మహమ్మారిని అంతం చేయవచ్చన్నారు. ఈ వ్యాక్సిన్ చైనా బయోఫార్మా సంస్థ కాన్‌సినో బయోలాజిక్స్ తయారు చేసింది. ఈ తరహాలో ముక్కు ద్వారా తీసుకునే వీలున్న టీకాలను భారత్ ఇప్పటికే అభివృద్ధి చేసినప్పటికీ పంపిణీ ఇంకా షురూ కాలేదు.
