China J-35A: ప్రపంచానికి సవాల్ విసిరే ఆయుధ సంపత్తిని శనివారం చైనా ప్రదర్శించింది. ఇందులో ఒక ఆయుధం ప్రత్యేక ఆకర్షిణగా నిలవడమే కాకుండా సైలెంట్ కిల్లర్ అనే పేరును సొంతం చేసుకుంది. చైనా శనివారం చాంగ్‌చున్ ఎయిర్ షోలో తొలిసారిగా తన J-35A స్టెల్త్ ఫైటర్ జెట్‌ను యాంటీ-రేడియేషన్ క్షిపణితో కలిపి ప్రదర్శించింది. దీనిని చైనా తన ఆధునిక ఫైటర్ జెట్‌లను వైమానిక పోరాటానికి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ మిషన్లకు కూడా సిద్ధం చేస్తోందనడానికి స్పష్టమైన సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (AVIC) అనేక క్షిపణులతో పాటు J-35A స్కేల్ మోడల్‌ను ప్రదర్శించింది. ఈ ఆయుధాలలో PL-10E, PL-15E, PL-12AE ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, LD-8A యాంటీ-రేడియేషన్ క్షిపణి వంటివి ఉన్నాయి.
READ ALSO: Buggana Rajendranath Reddy : కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ ఎలా కట్టారు?
సరికొత్త పాత్ర పోషించనున్న J-35A
J-35A, LD-8A క్షిపణిని ఏకకాలంలో ప్రదర్శించడం వలన ఈ ఫైటర్ జెట్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వేరియంట్‌ను కూడా కలిగి ఉండవచ్చని లేదా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కలిపి మిషన్‌లను నిర్వహించగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది చైనా వైమానిక పోరాట సామర్థ్యాలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. బీజింగ్‌కు చెందిన ఏరోస్పేస్ నాలెడ్జ్ మ్యాగజైన్ ఎడిటర్ వాంగ్ యానన్ మాట్లాడుతూ.. యాంటీ-రేడియేషన్ క్షిపణులు నేరుగా రాడార్ వ్యవస్థలపై దాడి చేస్తూ, విద్యుదయస్కాంత తరంగాలను విడుదల చేసే రాడార్ సంస్థాపనలను లక్ష్యంగా చేసుకుంటాయని పేర్కొన్నారు. ఈ క్షిపణులను సాధారణంగా శక్తివంతమైన సెన్సార్లు కలిగిన ఎలక్ట్రానిక్ యుద్ధ విమానాలు ఉపయోగిస్తాయని చెప్పారు.
PL-15 ఆధారంగా LD-8A క్షిపణి..
PL-15E ఎయిర్-టు-ఎయిర్ క్షిపణికి సమానమైన డిజైన్, పరిమాణాన్ని కలిగి ఉంది. నిపుణులు దీనిని PL-15 సిరీస్ వేరియంట్ కావచ్చునని అంటున్నారు. చైనా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ప్రస్తుత సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని, ఈ క్షిపణిని ప్రపంచంలోని ప్రముఖ ఆయుధాలలో ఒకటిగా చెబుతున్నారు. J-35A వంటి అధునాతన స్టెల్త్ జెట్‌లు, యాంటీ-రేడియేషన్ క్షిపణుల కలయిక ఆసియా-పసిఫిక్ ప్రాంతాలను ప్రభావితం చేయగలదని అంటున్నారు. చైనా ప్రదర్శించిన ఈ ఆధునాతన ఆయుధ సంపత్తిని చూసి అమెరికా, దాని మిత్రదేశాలకు ఆందోళన కలిగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చైనా రక్షణాత్మక కార్యకలాపాలకు మాత్రమే కాకుండా దాడి ప్రణాళికలకు కూడా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు.
READ ALSO: Indrakeeladri : దసరా మహోత్సవాల కోసం అంగరంగ వైభవంగా ముస్తాబైన ఇంద్రకీలాద్రి
