NTV Telugu Site icon

Wallet Robo: ఓరినీ కారును ఇలా కూడా కదిలించొచ్చా… వ్యాలెట్ రోబోతో పార్కింగ్ కష్టాలకు చెక్ పెడుతున్న చైనా

Robo

Robo

చైనా.. ఈ పేరు వింటేనే వింత వింత వస్తువులు గుర్తొస్తాయి. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి సమస్యకు మా దగ్గర సొల్యూషన్ ఉందంటూ అన్నీ కనిపెడుతూ ఉంటారు. వాటిని ప్రపంచ మార్కెట్ లోకి పంపిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో ఎక్కువ వస్తువులు మేడ్ ఇన్ చైనావే ఉంటున్నాయి. ఛీప్ గా దొరకడంతో పాటు తమ చిన్న చిన్న సమస్యలకు వీటితో చెక్ పెట్టే అవకాశం ఉండటంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు. చైనా వాళ్లు కనిపెడుతున్న వాటిలో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో ఒక దానిగా ప్రస్తుతం మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యాలెట్ రోబోను చెప్పుకోవచ్చు. దీంతో చైనాలో పార్కింగ్ సమస్యలు తగ్గుతున్నాయి.

మనం పొరపాటున రాంగ్ పార్కింగ్ లో వాహనాలను పార్క్ చేస్తే వాటిని తొలగించడానికి ట్రాఫిక్ పోలీసులు నానా తంటాలు పడుతూ ఉంటారు. టోవంగ్ వాహనాలతో లాగడం, ఎత్తిపడేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే వాటికి చెక్ పెట్టడానికి చైనా వాళ్లు ఒక అద్భతమైన పరికరాన్ని కనుగొన్నారు అదే వ్యాలెట్ రోబో. దీని సాయంతో రాంగ్ పార్క్ చేసిన కార్లను టోవంగ్ వాహనాలతో కాకండా దీనితో కదిపి అసలైన పార్కింగ్ ప్లేస్ లో ఉంచవచ్చు. ప్రస్తుతం ఈ వ్యాలెట్ రోబోకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. దీని పుణ్యమా అని చైనాలో పార్కింగ్ కష్టాలు తీరుతున్నాయి.

Also Read: Viral Video: సాగదీస్తూ ఇంగ్లీష్ మాట్లాడిన యువతి. ఆడేసుకుంటున్న నెటిజన్లు

వ్యాలెట్ రోబో పని తీరు చూస్తే.. సన్నగా సమతలంగా ఉన్న రోబో రాంగ్ పార్కింగ్  చేసిన కారు కిందికి వెళ్లడానికి సరిగ్గా సరిపోతుంది. కారు కిందకు వెళ్లిన రోబో టైర్లను గ్రిప్ తో పట్టుకుంటుంది. తరువాత కారును అక్కడి నుంచి తీసి సరైన పార్కింగ్ ప్లేస్ లో ఉంచుతుంది. దీనిని ట్రాఫిక్ పోలీసు రిమోట్ తో ఆపరేట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీని వల్ల నిజంగానే పార్కింగ్ సమస్యలు రావని కొందరు అంటుంటే, దీనిని కార్లకే కాకుండా బైక్ ల కోసం కూడా రూపొందించాలని మరికొందరు కోరుతున్నారు. ఇక మరికొందరు దొంగలకు ఇది బాగా ఉపయోగపడుతుందని, దీంతో దొంగతనాలు పెరిగిపోతాయి జాగ్రత్త అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్ చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. చైనా వాళ్లు చేసే ఆలోచనలు మంచికి ఎంత ఉపయోగపడతాయో చెడుకు కూడా అదే విధంగా దారి తీస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.