China: ఈ న్యూ ఇయర్ నుంచి చైనా చాలా మందిని ఆశ్చర్యపరిచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో తెలుసా.. జనవరి 1 నుంచి, డ్రాగన్ దేశంలో కండోమ్‌లు, గర్భనిరోధకాలపై 13% పన్ను విధిస్తున్నారు. నిజానికి చైనా ఇలా ఎందుకు చేస్తోందో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: RK Roja : బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో ‘ఫైర్ బ్రాండ్’ గ్రాండ్ రీ-ఎంట్రీ!
ప్రస్తుతం చైనా తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధికారిక డేటా ప్రకారం.. 2024లో దేశంలో కేవలం 9.54 మిలియన్ల మంది పిల్లలు మాత్రమే జన్మించారు. ఇది దశాబ్దం క్రితం జననాల సంఖ్యలో దాదాపు సగం. చైనా మొత్తం జనాభా వరుసగా మూడవ సంవత్సరం కూడా తగ్గింది. ఇదే టైంలో దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అలాగే యువకులు వివాహం చేసుకోడానికి, పిల్లలను కనడానికి సుముఖంగా లేరు. ఈ ఆందోళనల మధ్య, ప్రభుత్వం కండోమ్‌లు, గర్భనిరోధకాలపై పన్నులలో పెద్ద మార్పులు చేసింది. తాజాగా చైనా గర్భనిరోధకాలపై పెద్ద మొత్తంలో పన్ను విధించినా, పిల్లలు, వృద్ధుల సంరక్షణ, వివాహ సంబంధిత సేవలను పన్ను నుంచి మినహాయించారు.
ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యం ఏమిటంటే, యువకులు వివాహం చేసుకుని కుటుంబాలను ప్రారంభించేలా ప్రోత్సహించడమే. అయితే చైనా ప్రజలు ప్రభుత్వ విధానంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కు గురయ్యింది. ఈ సందర్భంగా చాలా మంది యూజర్స్ పిల్లలను పెంచడానికి అయ్యే ఖర్చు కంటే కండోమ్‌ల ధర చాలా ఎక్కువ అని కాంమెట్స్ పెడుతున్నారు. చైనాలో పిల్లలను పెంచడం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉద్యోగాలలో ఒకటిగా చెబుతుంటారు. 2024 నివేదిక ప్రకారం.. పిల్లల విద్య, ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు, పోటీ వాతావరణం చైనాలోని కుటుంబాలపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఉద్యోగం, మాతృత్వాన్ని సమర్ధంగా నిర్వహించడం కష్టంగా మారిపోయింది. ఇంకా రియల్ ఎస్టేట్ సంక్షోభం, ఆర్థిక మందగమనం యువతను వారి భవిష్యత్తు గురించి ఎటు తేల్చుకోనియడం లేదు. వివాహం, పిల్లల కోసం వెళ్లే ముందు చాలామంది యువత ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు.
అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అవాంఛిత గర్భధారణ, లైంగికంగా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని చాలా మంది మహిళలు, సామాజిక కార్యకర్తలు భయపడుతున్నారు. కొంతమంది నిపుణులు ఈ నిర్ణయాన్ని జనాభాను పెంచడానికే కాకుండా, ప్రభుత్వ ఖజానాను నింపే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. చైనా పన్ను ఆదాయంలో ఎక్కువ భాగం వ్యాట్ నుంచి వస్తుంది, ఆర్థిక మాంద్యం సమయంలో, ప్రభుత్వం సాధ్యమయ్యే ప్రతి వనరుల నుంచి ఆదాయాన్ని సేకరించాలని చూస్తుందని చెబుతున్నారు.
READ ALSO: New Year January 1 History: జనవరి 1నే న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
