NTV Telugu Site icon

China Condom: క్షీణించిన చైనా ఆర్థిక వ్యవస్థ.. ఊపందుకున్న కండోమ్స్ అమ్మకాలు

Condoms Most Expensive

Condoms Most Expensive

China Condom: చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. కరోనా వైరస్ తర్వాత ఇక్కడ నిరుద్యోగం వేగంగా పెరిగింది. మార్కెట్ పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉంది. అయితే వీటన్నింటి మధ్య కండోమ్‌ల అమ్మకం పెద్ద ఎత్తున పెరిగింది. దీంతో కండోమ్ తయారీ కంపెనీల ఆదాయాలు భారీగా పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పడిపోవడం, మరోవైపు యువత కండోమ్‌లను భారీగా కొనుగోలు చేయడంపై చైనా ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read Also:Captain Miller Teaser: ‘కెప్టెన్‌ మిల్లర్‌’ టీజర్‌ వచ్చేసింది.. ధనుష్‌ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోలా!

నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (NBS) నివేదిక ప్రకారం, చైనా రిటైల్ అమ్మకాలు మేలో 12.7 శాతం నుండి జూన్‌లో 3.1 శాతానికి పడిపోయాయి. రిటైల్ విక్రయాలు, ఎగుమతుల్లో భారీ క్షీణత ఉంది. దీని ప్రభావం ఉద్యోగాలపై కూడా పడింది. ఇది పెద్ద సంఖ్యలో యువతను నిరుద్యోగులుగా మార్చింది. యువత నిరుద్యోగులుగా ఇంట్లో కూర్చోవడం, చైనాలో కండోమ్‌ల విక్రయాలు విపరీతంగా పెరగడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. చైనాలోని కండోమ్ కంపెనీల లాభాలు రోజురోజుకు ఇక్కడ వేగంగా పెరుగుతున్నాయి. కోవిడ్ కాలంలో కూడా చైనాలో కండోమ్‌ల అమ్మకాలు పెరిగాయి.

Read Also:Mahalakshmi Stotras: మహా సంపదలు మీ సొంతం శుక్రవారం ఈ స్తోత్రం వినండి

డ్యూరెక్స్ కండోమ్‌ల తయారీదారు రెకిట్ బుధవారం మాట్లాడుతూ.. చైనాలో భారీ మాంద్యం ఉన్నప్పటికీ ప్రజలు కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారు. దాని అమ్మకాల్లో స్థిరమైన పెరుగుదల ఉంది. కండోమ్‌ల విక్రయాలు నిరంతరం పెరగడంతో కంపెనీలు, పెట్టుబడిదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. చైనా మార్కెట్‌లో లాక్‌డౌన్‌ సమయంలో కూడా కండోమ్‌ల విక్రయాల్లో ఎలాంటి తగ్గుదల లేదని డ్యూరెక్స్ కంపెనీ తెలిపింది. ఫలితాలను విడుదల చేస్తూ తమ వ్యాపారంలో 8.8 శాతం ఆదాయ వృద్ధి నమోదైందని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో కంపెనీ కొన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయవచ్చని డ్యూరెక్స్ కంపెనీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం కండోమ్‌ల విక్రయాలు పెరగడంపై ఆర్థికవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Show comments