Fuel From Air: గాలి, నీరు నుంచే పెట్రోల్, డీజిల్ తయారీ.. ఏం టెక్నాలజీ గురూ..
- పెట్రోల్, డీజిల్ కష్టాలకు చెక్..
- నీరు, గాలి నుంచి ఫ్యూయల్ తయారీ..
- సంచలనం సృష్టించిన చైనా స్టార్టప్ కంపెనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యుద్ధ భయాలు, చమురు సరఫరాలో ఆటంకాలు సామాన్యుడిని వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న గొడవలు, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్లిష్ట సమయంలో చైనాకు చెందిన ‘కార్బోనాలజీ’ అనే కంపెనీ ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. కేవలం గాలి, నీటిని ఉపయోగించి ‘కృత్రిమ ఇంధనాన్ని’ తయారు చేస్తున్నట్లు ప్రకటించింది.
టెస్లా మాజీ అధికారి సారథ్యంలో..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ కంపెనీని 2024లో ప్రపంచ ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ మాజీ వైస్ ప్రెసిడెంట్ స్థాపించారు. ఈయన నేతృత్వంలో గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను నేరుగా సేకరించే ‘డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్’ అనే సరికొత్త పద్ధతిని వీరు వాడుతున్నారు. సాధారణంగా గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను తీసి భూమిలో దాచిపెడతారు.. కానీ వీరు అలా కాకుండా, ఆ వాయువును నేరుగా పెట్రోల్, డీజిల్ వంటి ద్రవ ఇంధనంగా మారుస్తున్నారు.
Also Read:Hormuz Strait Crisis: హర్మూజ్ జలసంధిపై అమెరికా కీలక ప్రకటన..
ఇది ఎలా సాధ్యం…?
సౌర శక్తి లేదా పవన శక్తి వంటి పర్యావరణానికి మేలు చేసే విద్యుత్తును ఉపయోగించి, గాలిలోని కార్బన్‌ను, నీటిలోని హైడ్రోజన్‌ను వేరు చేస్తారు. ఆ తర్వాత కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా వీటిని కలిపి ఇంధనంగా మారుస్తారు. ఇది వినడానికి వింతగా ఉన్నా.. ప్రస్తుతానికి షాంఘైలో వీరు ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. విమానాల్లో వాడే ‘జెట్ ఇంధనాన్ని’ కూడా తయారు చేయడం మొదలుపెట్టారు.
చైనా ప్రపంచంలోనే అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశం. గల్ఫ్ దేశాల్లో ఏ చిన్న గొడవ జరిగినా చైనా ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పడుతుంది. అందుకే.. ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండటానికి చైనా ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఒకవేళ ఈ టెక్నాలజీ విజయవంతమైతే, పెట్రోల్ కోసం సౌదీ అరేబియా లేదా రష్యా వైపు చూడాల్సిన అవసరం ఉండదు.
సవాళ్లు ఏమిటి..?
అయితే.. ఈ టెక్నాలజీపై నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు సాధారణ పెట్రోల్ కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే.. ఈ కంపెనీ చెప్పిన విషయాలను ఇంకా బయటి సంస్థలు లేదా శాస్త్రవేత్తలు అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఇది కేవలం ప్రారంభ దశలో మాత్రమే ఉంది. ఇది నిజంగా సామాన్యుడికి అందుబాటులోకి రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. పర్యావరణం వైపు చూస్తే.. ఇది వాహనాల నుంచి వచ్చే పొగను మళ్లీ ఇంధనంగా మార్చే ప్రక్రియ కాబట్టి.. కాలుష్యం తగ్గడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!