Site icon NTV Telugu

Chimney Demolition : కళ్లెదుటే కుప్పకూలిన 110 మీటర్ల టవర్

Chimney

Chimney

Chimney Demolition: జార్ఖండ్‌ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ ప్లాంట్‌లో 27 ఏళ్ల క్రితం నిర్మించిన చిమ్నీని ఫ్యాక్టరీ సిబ్బంది ఆదివారం కూల్చివేశారు. 110మీట్లర ఎత్తున్న ఈ టవర్ కేవలం 11సెకన్లలోనే సురక్షితంగా నేలమట్టమైంది. ఇందుకు సంబంధించిన వీడియోను టాటా సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. వీడియోలో చిమ్నీ ఆధారం వద్ద పేలుడు కనపడుతోంది… ఆ తర్వాత నెమ్మదిగా అది నిర్దేశించిన ప్రదేశంలోకి చక్కగా పడిపోయింది. టవర్ కూలిన తర్వాత వెలువడే దుమ్మును నియంత్రించేందుకు వాటర్ కర్టెన్‌లను ఉపయోగించారు. ఝార్ఖండ్, జంషెడ్‌పూర్‌లో ఉన్న టాటా స్టీల్ ప్లాంట్‌లో 27 ఏళ్ల క్రితం ఒక చిమ్నీ(పొగగొట్టం) నిర్మించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో మరమ్మతుల కారణంగా ఈ చిమ్నీని కూల్చివేయాలని ప్లాట్ అధికారులు నిర్ణయించారు.

Read Also: FIFA World Cup2022 : ఖతార్‎ను కలవరపెడుతోన్న ‘కేమెల్ ఫ్లూ’.. ఆందోళనలో ఫుట్ బాల్ లవర్స్

అయితే, ఇది ప్లాంట్ మధ్యలో ఉండటంతో దీన్ని కూల్చేందుకు అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని కోసం దక్షణాఫ్రికాకు చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. ఈ సంస్థ ఇటీవల నోయిడాలోని ట్విన్ టవర్స్ ను కూల్చింది. దీంతో టాటా ప్లాంట్‌లోని చిమ్నీని కూల్చే బాధ్యతను కూడా ఈ సంస్థకే దక్కింది. దీనికి ముందు రిహార్సల్‌లో భాగంగా సమీపంలోని ఒక రిపేర్ షాపును కూల్చారు. ఇది విజయవంతం కావడంతో పొగగొట్టాన్ని కూల్చేందుకు సిద్ధమయ్యారు. ఇది 110 మీటర్ల ఎత్తు ఉండటంతో ఎవరికీ, ఎలాంటి హానీ జరగకుండా.. పూర్తి రక్షణ మధ్య దీన్ని కూల్చారు. మొత్తం 11 సెకండ్లలోనే ఈ చిమ్నీ టవర్ కూలిపోయింది. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Read Also: Manipal University : అలా అన్నందుకు స్టూడెంట్‎కు సారీ చెప్పిన ప్రొఫెసర్

Exit mobile version