Site icon NTV Telugu

kazakhstan: భార్యను కొట్టి చంపిన కజకిస్థాన్ మాజీ మంత్రి.. సీసీటీవీలో రికార్డు

Kazakh

Kazakh

కజకిస్థాన్ మాజీ ఆర్ధిక మంత్రి కువాండిక్ బిషింబాయేవ్ (44) తన భార్య సాల్టానాట్ (31) ను కొట్టి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయింది. సాల్టానాట్ నుకెనోవా గత నవంబర్‌లో ఓ రెస్టారెంట్‌లో శవమై కనిపించింది. ఆ రెస్టారెంట్‌లో 8 గంటలపాటు తనభార్య సాల్టానాట్ పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మరణించింది.

Bhatti Vikramarka : ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు

ఇటీవల.. కోర్టులో విచారణ సమయంలో మొత్తం సంఘటన యొక్క వీడియో బయటపడింది. అందులో బిషింబాయేవ్ తన భార్య సాల్టానాట్ పై క్రూరంగా దాడి చేస్తున్నట్లు కనిపించింది. అతను తన భార్యను ఆమె జుట్టుతో ఒక ప్రత్యేక గదికి లాగడం వీడియోలో కనిపిస్తుంది.. సాల్టానాట్ పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు, బిషింబాయేవ్ కొట్టాడని ప్రాసిక్యూటర్ కోర్టులో చెప్పాడు. అంతేకాకుండా.. 12 గంటల పాటు రక్తంలో తడిసి పడి ఉందని, ఆ తర్వాత అంబులెన్స్ ఘటనా స్థలానికి వచ్చిందని పేర్కొన్నారు. కాగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది ప్రకటించినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు.

Rahul Gandhi: రాయ్‌బరేలీ “కర్మభూమి”.. నా తల్లి బాధ్యతల్ని అప్పగించింది..

తలకు బలమైన గాయం కారణంగా సాల్టానాట్ మరణించింది. అంతేకాకుండా.. ముక్కులోని ఎముక విరిగిందని, ఆమె ముఖం, తల మరియు చేతులపై అనేక గాయాలు ఉన్నాయని నివేదికలు తెలిపాయి. మరోవైపు.. ఆమెను చిత్రహింసలు, తీవ్ర హింసతో హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా.. ఆమెకు న్యాయం జరగలంటూ వేలాది మంది సంతకాలు చేసిన పిటిషన్లు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో బిషింబాయేవ్‌కు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Exit mobile version