NTV Telugu Site icon

Hyderabad: చిలుకూరు ప్రధాన అర్చకుడి ఇంటిపై 20 మంది దాడి.. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు

Chilkur Balaji Temple

Chilkur Balaji Temple

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి 20 మందితో కలిసి వచ్చి దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో కలిసి విచక్షణ హంగామా చేశాడు వీర రాఘవరెడ్డి. దీంతో ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. నిందితుడు వీర రాఘవరెడ్డిని ఎస్వోటీ (SOT) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. మూడు రోజుల క్రితం తెల్లవారుజామున వీర రాఘవరెడ్డి అనుచరులు అర్చకులు ఇంట్లోకి చొరబడ్డారు. అంతేకాకుండా.. రంగరాజన్‌పై దూషిస్తూ హల్చల్ చేశారు.

Read Also: KTR: కులగణన తప్పుల తడక.. వెంటనే రీ సర్వే చేయండి

కాగా.. ఆలయం సమీపంలోని రంగరాజన్‌ నివాసానికి శుక్రవారం నాడు కొంతమంది వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు రంగరాజన్‌ నిరాకరించారు. రామరాజ్యం పేరుతో వచ్చిన వ్యక్తుల మాట నిరాకరించినందుకు తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని.. తనపైనా దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారితో పాటు పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. వీర రాఘవ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read Also: Prince Harry: “ఇప్పటికే భార్యతో కష్టపడుతున్నాడు”.. అతడిని బహిష్కరించనని ట్రంప్ హామీ..