Health Tips: వాతావరణంలో మార్పుల కారణంగా కొంతమంది పిల్లలు చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతుంది. చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?. వాతావరణం మారిన ప్రతిసారీ కొంతమంది పిల్లల్లో ఇన్ఫెక్షన్ లేదా జలుబు మరియు జ్వరం వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలకు గురవుతారు.. అయితే దానికి గల కారణాలేంటీ?
Read Also: Tomato Price Hike: “టమాటా గ్రాండ్ ఛాలెంజ్ హ్యాకథాన్”.. ధరలు తగ్గే ఆలోచనలు చెప్పండంటున్న కేంద్రం..
కాలానుగుణ మార్పుల కారణంగా పిల్లలు అనారోగ్యం పాలవడానికి అనేక కారణాలన్నాయంటున్నారు వైద్య నిపుణులు. అందులో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడమే ముఖ్య కారణమని చెబుతున్నారు. కొంతమంది పిల్లలు పూర్తిగా టీకాలు వేసుకోకపోవడం వలన.. దాని కారణంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. దాంతో పిల్లలు పదే పదే అనారోగ్యానికి గురవుతారని డాక్టర్లు అంటున్నారు. మరోవైపు కొంతమంది పిల్లల్లో కొన్ని వ్యాధులు ఉండటం వల్ల.. వాతావరణంలో మార్పు కారణంగా చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. అంతే కాకుండా పిల్లల జీవనశైలి వల్ల కూడా పిల్లలు రోగాల బారిన పడుతారని తెలుుతున్నారు. కొంతమంది పిల్లలు జంక్ ఫుడ్, పాత ఆహారం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతారు.
Read Also: Extramarital Affair: ప్రియుడి కోసం భార్య స్కెచ్.. మరో మహిళను రంగంలోకి దింపి..
పిల్లలకు వేయించే టీకా ఏదైనా మిస్ అయినట్లయితే.. వారు దానిని తప్పనిసరిగా చేయించుకోవాలని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. పిల్లల మంచి ఆరోగ్యానికి పూర్తిగా టీకాలు వేయడం చాలా ముఖ్యం. వారికి రోగనిరోధక శక్తిని పెంచే మోతాదులు ఉంటాయి. విటమిన్ ఎ సప్లిమెంట్ల కోసం టీకాలు, న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్, నిష్క్రియాత్మక పోలియో వ్యాక్సిన్, రోటవైరస్ వ్యాక్సిన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ మరియు న్యుమోకాకల్ వ్యాక్సిన్ పిల్లలకు ఇవ్వాలి. వీటితో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. పిల్లలకు చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. బయటి నుంచి జంక్ ఫుడ్ తినకుండా ఇంట్లోనే పౌష్టికాహారం తినిపించండి. పిల్లలు శారీరకంగా చురుకుగా ఉండే కార్యకలాపాలలో పాల్గొనేలా చేయండి. ఇలాంటివి చేయడం వల్ల మీరు పిల్లలను వ్యాధుల నుండి చాలా వరకు రక్షించగలరు.
