Mobile Phone: ప్రస్తుత రోజుల్లో పిల్లలకి చేతిలో ఫోను లేకుంటే రోజు గడవడానికి కష్టంగా మారంది. పొద్దున నిద్ర లేస్తే చాలు మొబైల్ పట్టుకొని ఆడుకోవడం, రీల్స్ చూడడం లాంటి వాటికి అలవాటు పడిపోయారు. కొన్నిసార్లు పక్కన ఏం జరుగుతున్న సరే పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా మొబైల్ కి అలవాటు పడిపోయిన కొందరు పిల్లలు ఏకంగా అనారోగ్యం పాలయ్యి చివరికి ఆసుపత్రిల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరికి పిచ్చి కూడా పట్టి చివరికి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Sharad pawar: గడియారం గుర్తుపై సుప్రీంకోర్టుకు శరద్ పవార్
సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు చూస్తూనే ఉండడం మామూలే. అందులో ఎక్కువగా వైరల్ అయిన వీడియోలు కనపడుతూ ఉంటాయి. తాజాగా, ఓ అబ్బాయి తన తల్లిని బ్యాట్ తీసుకొని కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మొదట పిల్లాడు మొబైల్ ఫోన్ చూస్తూ.. సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఆ సమయంలో అతడి తల్లి వచ్చి అతడి దగ్గర ఉన్న మొబైల్ ని లాక్కొని చివాట్లు పెట్టడం కనిపిస్తుంది. ఆ తర్వాత పిల్లాడు పక్కనే ఉన్న పుస్తకాన్ని తీసుకొని చదవడం మొదలుపెడతాడు. అలా కొద్దిసేపు తర్వాత పిల్లాడు ఎందుకో లేచి పక్కకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో ఉన్న బ్యాట్ తీసుకుని ఒక్కసారిగా తల్లి తలపై కొడతాడు. దాంతో తల్లి క్షణాల వ్యవధిలో స్పృహ తప్పి కింద పడిపోతుంది. అయితే, అదేమీ పట్టించుకోని ఆ పిల్లోడు తన తల్లి చేతిలో ఉన్న మొబైల్ ని తీసుకొని మళ్ళీ చూడడం ప్రారంభిస్తాడు.
Vizag Steel Plant: దిగొచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.. విధుల్లోకి 4,200 మంది కార్మికులు
ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం పిల్లల జనరేషన్ ఇలా ఉంది. ఫ్యూచర్ లో పిల్లలు ఎలా తయారవుతారో పరిస్థితి అర్థం అవ్వట్లేదు అని కొందరు వాపోతుండగా.. మరికొందరేమో., ఇది పక్కా క్రియేట్ చేసిన వీడియో అంటూ కొట్టి పడేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో వల్ల ప్రస్తుతం పిల్లలు ఎలా మారుతున్నారన్న విషయం మాత్రం అర్థం చేసుకోవచ్చు.
Mobile phone addiction is getting dangerous…. pic.twitter.com/rmJBHNuJYk
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 2, 2024