మా పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే పెద్ద సమస్య అండి. ఇంత వయసు వచ్చినా పక్క తడిపేస్తుంది అని చాలామంది తల్లులు కంప్లీట్ చేస్తుండటం మన ఇళ్లల్లో చూస్తుంటాం. సాధారణంగా పిల్లలు నాలుగైదేళ్ల మధ్య కాలంలో పక్క తడపడం ఆపేస్తారు. కొద్దిమంది ఒక వయసు వచ్చాక కూడా రాత్రిపూట పక్క తడుపుతూ ఉంటారు. ఇలా తడపడాన్ని వైద్య పరిభాషలో ఎన్యూరెసిస్ అంటారు. అలాగే నిద్రలో పక్క తడిపే పిల్లలందర్నీ ఎన్యూరెసిస్ కింద పరిగణించకూడదు. నాలుగు ఏళ్లలోపు పిల్లలు అలా తడపడం సహజ లక్షణమే కాదు హక్కు కూడా. ఆరు సంవత్సరాల వయసు దాటాక.. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పక్క తడిపే సమస్యగా గుర్తించాలి. ఇంక ఈ సమస్యకు కారణాలేమైనా చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలతో అలవాటును మాన్పించవచ్చు. మూత్రకోశ జననేంద్రియ వ్యవస్థను ఉత్తేజపరిచి నాడీ వ్యవస్థను బలపరిచే మూలికల మిశ్రమాలను వాడటం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఈ కింద చెప్పబోయే చిట్కాలలో మీకు అనువైనవి చూసుకుని వాడి విజయం సాధించండి.
Also Read : Tech Tips : మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఇలా చేయండి
రాత్రిపూట పిల్లలు పడుకోబోయే ముందు పొట్టు తీయని నల్లనువ్వులు తీసుకుని బెల్లం కలిపి చిన్న ఉండలు కట్టి 1, 2 ఉండాలను పెట్టండి. పిల్లలు ఇష్టపడి తింటారు. వాళ్ళు పక్క తడిపే అలవాటు నుంచి బయటపడతారు కూడా. అలాగే ములగ ఆకు కూర మిశ్రమాన్ని తినిపించాలి. కావాల్సిన పదార్థాలు, మునగాకు, పెసరపప్పు తయారీ విధానం.. మునగాకు, పెసరపప్పు కలిపి ఈగురు కూరగా వండి వారానికి రెండుసార్లు చొప్పున పెట్టాలి. బెల్లంలో ఉండే వేడి కారణంగా. పక్క తడిపే సమస్య వెంటనే అదృశ్యమవుతుంది. ప్రతి రోజు ఉదయం పూట కప్పు గోరువెచ్చని నీటిలో బెల్లం వేసి ఇవ్వాలి. గంట తర్వాత నువ్వు ఇవ్వాలి. నువ్వు గింజలు వేయించి దానికి రాతి ఉప్పు కలిపి ఇవ్వాలి. ఈ విధంగా ప్రతిరోజు రెండు నెలలపాటు చేస్తే మీ పిల్లల్లో ఉండే ఈ అలవాటును దూరం చేయవచ్చు. మీ పిల్లలకు పక్క తడిపే అలవాటు ఉందని గుర్తిస్తే వారికి రోజులో ఒకసారి దాల్చినచెక్క చిన్నముక్క ఇచ్చి కొరకమని చెప్పాలి. పక్క తడిపే సమస్య నివారణకు ఇది కూడా ఒక మంచి చిట్కా.
Also Read : Chiranjeevi: ‘ఇంద్ర’ తర్వాత ‘అన్నయ్య’కి ఇదే ‘ఫస్ట్ హిట్’…
మీ పిల్లలకు అరటిపండ్లు తినడం అలవాటు చేస్తే సాయంత్రం వేళల్లో పక్క తడిపే అలవాటును నివారించవచ్చు. ఎండుద్రాక్షను పక్క తడిపే సమస్య నివారించడానికి ఉపయోగిస్తుంటారు. పిల్లలు నిద్రపోయే సమయంలో వీటినిస్తే మంచి ఫలితం వస్తుంది. ఒక నెలపాటు ఈ విధంగా ఇవ్వాలి. పక్క తడిపే సమస్య నివారణలో తేనె, చక్కెర వంటివి మంచిగా పని చేస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో పాలులోనే తేనె కలిపివచ్చు. తేనె రుచిగా ఉండటం వల్ల పిల్లలు కూడా ఇష్టపడతారు. గ్రాండ్ బెర్రీ జ్యూస్, మూత్రపిండాలు, పిత్తాశయం, మూత్ర మార్గానికి ఉపయోగకరంగా ఉంటుంది. పక్క తడిపే పిల్లలకు ఉపయోగపడుతుంది. పిల్లలు పడుకునే ముందు ఈ జ్యూస్ ఇవ్వాలి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.