NTV Telugu Site icon

Accident: బస్సు డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లే రోడ్డు ప్రమాదం.. పోలీసుల విచారణలో కీలక విషయాలు..!

Addicent 1

Addicent 1

Chilakaluripet road accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓటు వేసి తిరిగి వస్తుండగా బస్సు – టిప్పర్ ఢీ కొట్టడంతో ఆరుగురు సజీవదహనం అయ్యారు. బాపట్ల జిల్లా చిన్నాగంజం నుంచి హైదరాబాదుకు బయలు దేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, చిలకలూరిపేట మండలం ఈవూరి వారి పాలెం డొంక సమీపంలో ఒక టిప్పర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు – టిప్పర్ ఢీ కొవడంతో అక్కడికక్కడే మంటలు వ్యాపించి రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్ తో పాటు మరో నలుగురు బస్సులోని ప్రయాణికులు సజీవదహనం అయ్యారు.

Read Also: Purandeswari: బస్సు యాక్సిడెంట్లో మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపిన పురంధేశ్వరి..

కాగా, బస్సు బయలుదేరినప్పటి నుంచి ప్రయాణికుల్లో ఆందోళన నెలకొందని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. బస్ డ్రైవర్ యమ స్పీడుతో నడిపారని పోలీసులకు సమాచారం. చిన గంజాం నుంచి బయలుదేరినప్పటి నుంచి బస్సును డ్రైవర్ అంజి ఓవర్ స్పీడ్ గా నడిపినట్లు చెప్పుకొచ్చారు. ఫాస్టుగా వెళ్లొద్దని పలువురు ప్రయాణికులు నివారించినట్లు తెలిపారు. బస్సెక్కిన గంటప్పావులో ఆరు నిండు ప్రాణాలు బుగ్గిపాలైనట్లు చెప్పారు. ఇప్పటికీ మరో మృతుని ఆచూకి తెలియలేదు.. బస్ డ్రైవర్ సీటు వెనుకున్న బెర్తులో పడుకున్న వ్యక్తి చనిపోయినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక, బస్సు ప్రమాదంతో బస్ క్లీనర్ బెంబేలెత్తి పారిపోయినట్లు తెలుస్తుంది. బస్ క్లీనర్ ఆచూకీపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గురైన లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్ బస్ చీరాలకు చెందునదిగా గుర్తించారు. ప్రమాదంలో చనిపోయిన ఓనర్ కమ్ డ్రైవర్ అంజీ.. ప్రమాద సమయంలో డ్రైవర్ల కండీషన్లపై పోలీసుల ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే, చిలకలూరి పేట బస్సు ప్రమాదంలో గాయపడిన వారిలో ఏడుగురికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఐదుగురికి చికిత్స చేసిన పంపించిన వైద్యులు.. మరో ఇద్దరు క్షతగాత్రులకి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.