Site icon NTV Telugu

CS Review on Kantivelugu: కంటి వెలుగు అమలుపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Cs Review

Cs Review

CS Review on Kantivelugu: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షించారు. బీఆర్కే భవన్‌ నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం. రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మొహంతిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఇప్పటివరకు క్షేత్ర స్థాయి క్యాంప్‌ల నిర్వహణ విజయవంతంగా జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

CM K.Chandrashekar Rao: రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష

రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. అవసరమైన 97,335 మందికి కంటి అద్దాల పంపిణీ చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో వున్న బఫర్ టీమ్స్ ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలియన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్‌ల వద్ద ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్‌లను నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. కంటి అద్దాల నిల్వలను (స్టాక్స్) వివరాలను రోజు వారిగా సరిచూసుకోవాలని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంప్‌ల నిర్వహణ చేపట్టాలని అన్నారు.

Exit mobile version