NTV Telugu Site icon

CM Jagan: నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ

Cm Jagan

Cm Jagan

ఆంధ్ర ప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. నేటి ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ బయలుదేరి ప్రత్యేక విమానంలో 9:50 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో 10.30 గంటలకు చింతపల్లి మండలం చౌడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో ఆయన దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా చౌడిపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు చేరుకోనున్నారు.

Read Also: Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

ఇక, చౌడిపల్లి గ్రామంలో గిరిజన విద్యార్థులకు సీఎం జగన్ ట్యాబులు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి రోడ్డు మార్గం ద్వారా చేరుకొని స్మాల్‌ టెక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఉదయం 11. 20 గంటలకు ప్రత్యేక సభ ప్రాంగణంలోకి చేరుకోనున్నారు. అక్కడ 40 నిమిషాల పాటు గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతారు.. అనంతరం మధ్యాహ్నం 12: 30 గంటలకు సభా ప్రాంగణం నుంచి హెలిప్యాడ్‌కు చేరుకోని.. అక్కడే దాదాపు 30 నిమిషాలు స్థానిక నాయకులతో సీఎం జగన్ మాట్లాడుతారు. అయితే, సీఎం జగన్ మధ్యా్హ్నం 1: 30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని.. అక్కడి నుంచి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ, పలువురు అధికారులు పర్యవేక్షించారు.