NTV Telugu Site icon

CM Chandrababu: 10 రోజుల తర్వాత నివాసానికి సీఎం.. ప్రతీ రోజూ క్షేత్రస్థాయి పర్యటన

Cm Chandrababu

Cm Chandrababu

పది రోజుల తరువాత తన ఇంటికి వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విపత్తు సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారాయన. విపత్తు సమయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఉంటూ.. ప్రతీరోజూ క్షేత్రస్ధాయిలో వరద పరిస్ధితులను సమీక్షించారు సీఎం చంద్రబాబు. కలెక్టరేటునే సెక్రటేరీయేట్ చేసుకుని పర్యవేక్షించే వారు. అంతేకాకుండా.. ప్రతీరోజు రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. పది రోజుల్లో ప్రతి రోజూ క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లారు ముఖ్యమంత్రి. తొలి మూడు రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో తెల్లార్లూ తనిఖీలు నిర్వహించారు. గండ్ల పూడ్చివేత మొదలుకుని సహయక చప్యల వరకు కలెక్టరేట్ నుంచి పది రోజుల పాటు పర్యవేక్షించారు. దీంతో.. వినాయక చవితి, పెళ్లి రోజును కూడా కలెక్టరేట్ ప్రాంగణంలోనే జరుపుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Read Also: JK Polls: అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అఫ్జల్ గురు సోదరుడు

మరోవైపు..వరద సహయక చర్యల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్తు సమయంలో అధికారులు, ఉద్యోగులు స్పందించిన తీరు అద్భుతం అని ప్రశంసించారు. ఇబ్బందుల్లోనూ, కష్ట కాలంలోనూ అధికార యంత్రాంగం సహకరించిందని.. ఇదే స్ఫూర్తితో ఇక పైనా సహయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని అధికారులను కోరారు. వరద సాయంపై ఇప్పుడున్న తరహాలోనే ప్రతి రోజూ రివ్యూ చేస్తానన్నారు. బాధితులకు సాయం అందించి.. ప్రజల మన్ననలు పొందాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు.

Read Also: Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..