NTV Telugu Site icon

P. Chidambaram: మోడీ ప్రభుత్వంలో మైనార్టీలు భయంతో బతుకుతున్నారు..

Chidambaram

Chidambaram

క్రైస్తవ హక్కుల సమావేశం హరిహర కళాభావన్ లో జరిగింది ఈ సమావేశానికి మాజీ కేంద్రమంత్రి చిదంబరం, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి చిదంబరం మాట్లాడుతూ.. నాకు తెలుగు రాకున్నా..10,12 ఏండ్ల క్రితం తెలంగాణ గురించి మాట్లాడుతుంటే అర్థం అయ్యేది.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు.. కానీ కాంగ్రెస్ అధికారంలో కి రాలేదు అని ఆయన అన్నారు. విభజన జరిగిన వెంటనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఎన్నో రెట్లు అభివృద్ధి చెందేది అని చిదంబరం అన్నారు.

Read Also: Congress: మధ్యప్రదేశ్ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక భేటీ

సీడబ్ల్యూసీ మీటింగ్ హైదరాబాద్ లో ఇటీవల జరిగింది అని చిదంబరం అన్నారు. Cwc మీటింగ్ తర్వాత జరిగిన సభ.. నా జీవితంలో అలాంటి సభ చూడలేదు.. ఆ సభలో 45 శాతం 25 ఏళ్ల యువకులు ఉన్నారు.. సభ చూశాక.. తెలంగాణ మార్పు తధ్యం అని అర్థమైంది.. క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా తమకు దక్కాల్సింది మిస్ అయ్యింది అనే ఫిలింగ్ లో ఉంది.. ఏ సమాజమైన మూడు కారణాలతో ఇబ్బంది పడుతున్నాయి.. నిరుద్యోగం అనేది మొదటిది.. 25 ఏళ్ల లోపు ఉన్న యువత 15 శాతం ఉద్యోగాలు లేకుండా ఉన్నారు.. ప్రతీ ఒక్కరు నిరుద్యోగ సమస్యని ఎదుర్కొంటున్నారు.. రెండో కారణం.. ధరల పెరుగుదల 20 నెలల నుంచి 6 శాతం ధరలు పెరిగాయి.. ఇది దేశ చరిత్రలో మొదటిది.. మూడో కారణం.. సేవింగ్స్ తక్కువ.. అప్పులు ఎక్కువ అయ్యాయని చిదంబరం పేర్కొన్నారు.

Read Also: ICC Cricket World Cup 2023: రికార్డులు అన్నీ బద్దలు కొట్టిన సౌతాఫ్రికా..

ఢిల్లీ, హైదరాబాద్ ప్రభుత్వాలకు ఇవేం పట్టడం లేదు అని చిదంబరం అన్నారు. మోడీ వచ్చి కేసీఆర్ ని తిడతారు.. కేసీఆర్, మోడీని తిడతారు.. కానీ సమస్యలపై ఎవరు మాట్లాడటం లేదు.. చిన్నచూపు అనేది దేశంలో పెరిగింది.. మైనార్టీలు భయంతో బతుకుతున్నారు.. మోడీ ప్రభుత్వంలో అంతా భయంతో బతుకుతున్నారు.. కేంద్రంలో 79 మంది మంత్రులు ఉన్నారు.. కేవలం ఒక్కడే క్రైస్తవ మంత్రి ఉన్నారు అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో ఒకరు కూడా న్యాయవాది క్రిస్టియన్ లేరు.. బయట దేశాల నుండి దేశంలో సేవ చేయడానికి ఇక్కడి సంస్థలకు వచ్చే నిధులు మేము ఎప్పుడు ఆపలేదు.. కానీ మోడీ వచ్చాకా.. 6622 సంస్థల fcra లైసెన్స్ రద్దు చేశారు అని చిదంబరం చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం మెల్లమెల్లగా తుడిచి పెట్టుకుపోతుంది అని మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. ప్రజాస్వామ్య స్వేచ్ఛ పోతే మొదట ఇబ్బంది పడేది.. మైనార్టీలు, ప్రజాస్వామ్యం అనేది మనకు కవచం లాంటిది.. దాన్ని అందరం కాపాడుకోవాలి అని ఆయన పేర్కొన్నారు.