కార్తీక మాసం పోయిన తరువాత చికెన్ ధరలు క్రమంగా పెరగుతున్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో మార్కెట్లో చికెన్ ధరలను పరిశీలిస్తే కిలో చికెన్ స్కిన్ లెస్ 260 రూపాయలకు అమ్ముతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అదే విధంగా స్కిన్ తో 220 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇక, కార్తీక మాసంలో కిలో 130 నుంచి 180 రూపాయల వరకు ఉండేది. ప్రస్తుతం కార్తీక మాసం అయిపోవడంతో మాంసప్రియలు చికెన్ కొనుగోలుకు ప్రజలు ఎగబడుతున్నారు. దీంతో ప్రస్తుతం చికెన్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
Read Also: PM Modi: పార్లమెంట్ ఘటన దురదృష్ణకరం: ప్రధాని మోడీ
ఇక, పిక్నిక్ లా సీజన్ మొదలవడంతో ఒక్కసారిగా 70 నుంచి 80 రూపాయల వరకు చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి.. నాన్ వెజ్ ప్రియుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో మాంసప్రియులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలం వినియోగం ఎక్కువగా ఉండటం వలన చికెన్ ధరలు మరింత పెరబోతున్నాయని అంటున్నారు. అయితే, ఉదయం నుంచే చికెన్ కొనుగోలు కోసం మాంసాహార ప్రియులతో మార్కెట్ కిటకిటలాడుతోంది.. మరోవైపు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటడంతో సామాన్య ప్రజలు చికెన్ వైపే మొగ్గు చూపుతున్నారు. రేట్లు పెరిగిన ఆదివారం కావడంతో చికెన్ కొనక తప్పడం లేదని ప్రజలు అంటున్నారు.