NTV Telugu Site icon

Chicago: ఓ పక్క రయ్..రయ్.. మరో పక్క ఢమాల్.. ఢమాల్.. చికాగోలో షాకింగ్

Drag Racing

Drag Racing

Chicago: చికాగోలోని బ్రైటన్ పార్క్ పరిసరాల్లో జరిగిన డ్రాగ్ రేసింగ్ ఈవెంట్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. కొంతమంది 100కార్లతో డ్రాగ్ రేసింగ్ నిర్వహించి విధ్వంసం సృష్టించారు. తుపాకులతో కాల్పులు జరిపి రెచ్చిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: Thangalaan: మరో క్రేజీ పాత్రలో చియాన్ విక్రమ్.. విభిన్న కథనంతో ‘తంగలాన్’

చికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో కమాండర్ డాన్ జెరోమ్ ఓ సమావేశంలో మాట్లాడారు. డ్రాగ్ రేసింగ్ కారవాన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. దాదాపు 100 కార్లు కూడలిపై నియంత్రణ సాధించాయని, పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్షంగా నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షించబడుతున్నాయని జెరోమ్ చెప్పారు. కొన్ని గ్యాంగులు కలిసి కార్లతో స్టంట్లు చేశారని పేర్కొన్నారు. పోలీసు అధికారులు కనీసం 13 రౌండ్లు కాల్పులు జరిపినట్లు హెచ్చరికలు అందుకున్నారు. తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఐదుగురు బుల్లెట్ గాయాలతో పడి ఉన్నారని, వెంటనే వారిని ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. అందులో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని, మిగతా ఇద్దరి పరిస్థి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.

Show comments