Site icon NTV Telugu

Fire Accident: మ్యాట్రెస్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళా కార్మికులు మృతి..

Fire Accident

Fire Accident

బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రాయ్‌పూర్‌లోని గోండ్వారా ప్రాంతంలోని మెట్రెస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు మరణించారు. అగ్నిమాపక సిబ్బంది విజయవంతంగా మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకొని అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఖమ్తరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోండ్వారా ప్రాంతంలో ఉన్న శ్రీ గురునానక్ మ్యాట్రెస్ కంపెనీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Samantha Ruth Prabhu: సినిమలున్నా లేకున్నా సమంతే తోపు బాసూ..

పోలీసుల నివేదికల ప్రకారం, ఫ్యాక్టరీలో ఉన్న ఏడుగురు కార్మికులలో ఐదుగురు ఈ ప్రమాదం నుండి తప్పించుకోగలిగారు. అయితే., సరోరా గ్రామానికి చెందిన యమునా, రామేశ్వరి అనే ఇద్దరు మహిళలు లోపల ఇరుక్కుపోయి మృతి చెందారు. ఏడుగురు కార్మికులు పని చేస్తున్న మ్యాట్రెస్ ఫ్యాక్టరీలో మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున చెలరేగాయి. వారిలో ఐదుగురు తమను తాము రక్షించుకోగలిగారు. అయితే ఇద్దరు మహిళా కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. శరీరం బాగా కాలిన వారిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ కాలిన గాయాలతో వారు మరణించారు. ఈ విషయాన్నీ పోలీసు అధికారి నిర్ధారించారు.

Exit mobile version