Road Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ – బీజాపూర్ హైవేపై చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు కుడి వైపు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ దాని పైనే బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. అతని మృతదేహం టిప్పర్‌లో ఇరుక్కుపోయింది.
Private Colleges Bandh: 9 వేల కోట్ల బకాయిల కోసం పోరు.. నేటి నుంచి ప్రైవేటు కళాశాలలు బంద్..!
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వాహనదారులు స్పందించి బస్సులోంచి ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Bike Stunt: మీ రీల్స్ పిచ్చి తగలెయ్య… స్టంట్స్ చేస్తూ బొక్కబోర్ల పడ్డ జంట
