Site icon NTV Telugu

Chevella Bus Accident: రాంగ్ రూట్, సిగ్నల్ జంప్.. బస్సు, టిప్పర్ లారీలపై భారీగా చలాన్లు..!

Chalan

Chalan

Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం సంబంధించి మరింత దారుణ వివరాలను బయటపెడుతోంది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ పెను ప్రమాదానికి కారణమైన బస్సు, టిప్పర్ లారీపై గతంలో పలు ట్రాఫిక్ చలాన్లు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇకపోతే పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సుపై రూ. 2,305 చలాన్లు, టిప్పర్ లారీపై రూ. 3,270 చొప్పున చలాన్లు ఉన్నట్లు గుర్తించారు.

Chevella Bus Accident: గతంలో ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్ దస్తగిరి.. ఈ ప్రమాదంలో మృతి!

ఇవి ప్రధానంగా రాంగ్ రూట్, సిగ్నల్ జంప్ వంటి ఉల్లంఘనలకు సంబంధించి ఉన్నాయి. ఈ ప్రమాదానికి డ్రైవర్ల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు చెబుతున్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును కంకర లారీ ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటన సంబంధించి సహాయం కోసం 9912919545, 94408544332 రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లను ఉంచింది.

Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో

Exit mobile version