Site icon NTV Telugu

Cheteshwar Pujara Suspended: చతేశ్వర్‌ పుజారాపై సస్పెన్షన్‌ వేటు.. కారణం ఏంటంటే?

Cheteshwar Pujara Ecb

Cheteshwar Pujara Ecb

Cheteshwar Pujara Suspended by ECB: భారత టెస్ట్‌ ప్లేయర్ చెతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్‌ వేటు పడింది. పుజారాపై ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇంగ్లండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2023లో పుజారా సారథ్యం వహిస్తున్న సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్‌ జట్టుకు 12 పాయింట్లు పెనాల్టీ పడగా.. ఆ జట్టు కెప్టెన్‌పై పడింది. ఈసీబీ నిబంధనల ప్రకారం ఒక సీజన్‌లో ఓ జట్టు ఖాతాలో నాలుగు ఫిక్స్‌డ్‌ పెనాల్టీలు ఉంటే.. సదరు జట్టు కెప్టెన్‌పై ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు పడుతుంది.

సెప్టెంబర్‌ 13న లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు పెనాల్టీలు సస్సెక్స్ ఖాతాలో చేరాయి. అంతకుముందు రెండు ఫిక్స్‌డ్‌ పెనాల్టీలు ఉండడంతో.. మొత్తంగా 12 డీమెరిట్‌ పాయింట్స్ సస్సెక్స్ ఖాతాలో చేరాయి. దాంతో సస్సెక్స్ చతేశ్వర్‌ కెప్టెన్ పుజారాపై సస్పెన్షన్‌ను ఈసీబీ అధికారులు విధించారు. ఆటగాళ్ల ఆన్‌ ఫీల్డ్‌ ప్రవర్తన కారణంగా ససెక్స్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ససెక్స్‌ ఆటగాళ్లు జాక్‌ కార్సన్‌, టామ్‌ హెయిన్స్‌, అరి కార్వెలాస్‌లు మైదానంలో నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించడంతో పుజారా బలయ్యాడు.

Also Read: Gold Price Today : షాకిస్తున్న బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే?

టామ్‌ హెయిన్స్‌, జాక్‌ కార్సన్‌లపై అధికారులు ఓ మ్యాచ్‌ వేటు వేశారు. విచారణ అనంతరం అరి కార్వెలాస్‌పై కూడా చర్యలు తీసుకోనున్నారు. పాయింట్ల కోత కారణంగా ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్‌ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ససెక్స్‌ ఖాతాలో 124 పాయింట్లు ఉన్నాయి. కౌంటీ డివిజన్‌ 2 పోటీల్లో భాగంగా ససెక్స్‌ జట్టు డెర్బీషైర్‌తో తలపడాల్సి ఉంది. ఆపై సెప్టెంబర్‌ 26న గ్లోసెస్టర్‌షైర్‌తో తలపడనుంది. డెర్బీషైర్‌తో మ్యాచుకు ససెక్స్‌ కెప్టెన్ పుజారా దూరం కానున్నాడు.

 

Exit mobile version