ఈరోజుల్లో పురాతన విధానాలు, కుటుంబాలను వెలివేయడం, వారిని ఇబ్బంది పెట్టడం,పెదరాయుడు తరహా పద్ధతులు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో ఇలాంటి దారుణం ఒకటి జరిగింది. అచ్చం పెదరాయుడు తరహా సినిమాలో వెలివేసినట్టు కుటుంబంపై ఆంక్షలు విధించారు. ఒక కుటుంబాన్ని వెలివేశారు సంఘం పెద్దలు. ఆ కుటుంబంతో ఎవరు మాట్లాడిన 5వేలు జరిమానా వేస్తామని హుకుం జారీ చేశారు. చెరుకువాడకి చెందిన రాణి ఆకివీడుకి చెందిన సతీష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
రాణి బతుకు తెరువు కోసం కొంతకాలం దుబాయ్ వెళ్లి వచ్చింది. అలా వచ్చిన డబ్బుతో సొంతంగా ఇల్లు నిర్మించుకుంది. తన భర్త పిల్లలతో ఆ ఇంట్లోనే ఉంటుంది. రాణిని లోబర్చుకోవాలని చూసాడు సంఘ పెద్ద కనకారావు. భర్త సతీష్ ను రాణి ఇంటికి రావద్దని కులాంతర వివాహం చేసుకున్నావని తమకు ఇష్టం లేదని హెచ్చరించేవారు. గతంలో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు సంఘ పెద్దలకు, రాణి కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
Read Also:Bar Code: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మెడిసిన్స్‌పై బార్‌కోడ్ తప్పనిసరి
కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సంఘ పెద్దలు రాణిని, కుటుంబ సభ్యులను వేధించడం మొదలుపెట్టారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కక్ష కట్టి వెలి వేసారు సంఘ పెద్దలు. సంఘ పెద్దలు కనకారావు, మధు, మోహన్ రావులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మనస్థాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించామని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధిత కుటుంబం. ఇంత టెక్నాలజీ పెరిగినా, ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నా.. ఇలాంటి వెలి ఘటనలు సభ్యసమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి.
Read ALso: Canada: భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన కెనడా..