రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు ప్రజా సమస్యల పరిష్కారంలో పోరాడిన గొప్ప నాయకుడు అని వ్యాఖ్యనించారు. కమ్యూనిస్టు నాయకుడిగా మేధావిగా రాష్ట్ర జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది.. అనుభవము గొప్ప మేధావిగా ఉన్న ఆయన అనేక సమస్యలపై ప్రత్యక్ష పోరాటం కూడా చేశారు.. ఆయన చేసిన పోరాటాలు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో చైతన్యాన్ని కూడా నింపాయి అని మంత్రి అన్నారు.
నాటి తరం నుండి నేటి వరకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు కూడా దక్కింది అని చెప్పుకొచ్చారు.
రాజేశ్వర్ రావు జ్ఞాపకాలు రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు ఉంటాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉన్నత సామాజిక వర్గంలో జన్మించిన బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటాలు, గడిపిన జైలు జీవితాలు ఆదర్శంగా నిలిచాయి.. నాటి పరిస్థితులు వేరని అప్పటి కమ్యూనిస్టులను అప్పటి ప్రభుత్వాలు వ్యతిరేకించిన తీరు, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం చేసిన పోరాటాలు గుర్తుంటాయన్నారు. చెన్నమనేని కుటుంబం చాలా గొప్పది.. చెన్నమనేని రాజేశ్వరరావు, విద్యాసాగర్ రావు, హనుమంతరావు లాంటి నాయకులు ఎనలేని సేవలు అందించారు.. జర్మనీలో ప్రొఫెసర్ గా ఉండి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించడమే కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఆయన సేవలు ఎంతగానో ఈ ప్రజలకు అందాయి.. చెన్నమనేని రాజేశ్వరరావు చాయ చిత్ర ప్రదర్శన మరోసారి ఆయన కళ్ళ ముందు ఉన్నట్లుగా అనిపించిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
Read Also: Parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం పిలుపు..