Site icon NTV Telugu

RCB vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆప్స్‌కు ఆర్సీబీ?

Rcbvscsk

Rcbvscsk

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగుళూరు వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ ఛాన్స్ కోల్పోయిన చెన్నై.. పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానానికి చేరుకుంది. 10 మ్యాచులు ఆడి కేవలం 2 మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నై, ఆర్సీబీ కలిసి ఆడే చివరి మ్యాచ్ ఇది.. 10 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 7 మ్యాచుల్లో గెలిచింది. టేబుల్ లో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా.. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే ఆ టీమ్‌ ప్లేఆప్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంటుంది.

READ MORE: Suspicious Death: వివాహిత అనుమానాస్పద మృతి.. తిరువూరులో ఉద్రిక్తత..

ఇరు జట్ల తుది జాబితా ఇదే…
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: జాకబ్‌ బెతెల్‌, విరాట్‌ కోహ్లీ, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పటీదార్‌ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), టిమ్‌ డేవిడ్‌, కృనాల్‌ పాండ్య, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్‌ కుమార్‌, లుంగి ఎంగిడి, యశ్‌ దయాళ్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌: షేక్‌ రషీద్‌, ఆయుష్‌ మాత్రే, సామ్‌ కరణ్‌, రవీంద్ర జడేజా, డెవాల్డ్‌ బ్రెవిస్‌, దీపక్‌ హుడా, ఎంఎస్‌ ధోనీ (వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), నూర్‌ అహ్మద్‌, ఖలీల్‌ అహ్మద్‌, అన్షుల్‌ కాంబోజ్‌, మతీషా పతిరన

READ MORE: Panipuri : మీకు పానీపూరి ఇష్టమా.. ఇక్కడ పానీపూరితో పాటు అది ఫ్రీ

Exit mobile version