NTV Telugu Site icon

Couple’s Death: ఫోటో షూట్‎లో బోటు బోల్తా పడి చనిపోయిన హనీమూన్ కపుల్స్

Chennai Couple

Chennai Couple

Couple’s Death: పెళ్లై పట్టుమని పదిరోజులు కాలేదు.. పెళ్లిలో కాళ్లకుపెట్టిన పారాణి ఇంకా ఆరనేలేదు.. ఇంతలోనే నవ దంపతులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. జూన్ 1న ఇద్దరూ పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం బాలి వెళ్లారు. ఈ మధ్య కాలంలో హనీమూన్ సమయంలో ఫోటోషూట్ చాలా సాధారణమైపోయింది. బహుశా ఇలా ఆలోచించి, స్పీడ్ బోట్ రైడ్ సమయంలో చిత్రాలను క్లిక్ చేయడానికి డాక్టర్ దంపతులు కూడా సముద్రంలోకి వెళ్లారు.. బహుషా వారు ఊహించి ఉండరు ఇదే వారికి లాస్ట్ రైడ్ అవుతుందని.

చనిపోయిన డాక్టర్ దంపతులను లోకేశ్వరన్, విభూషానియాగా గుర్తించారు. ఇటీవలే జూన్ 1న పూనమల్లిలోని ఓ కళ్యాణమండపంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఫోటోషూట్‌లో మునిగిపోవడంతో దంపతులు మృతి చెందారని ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇంట్లో వారిద్దరి మృతి సమాచారం రాగానే పెళ్లి సంతోషం క్షణాల్లో శోకసంద్రంగా మారింది. హడావుడిగా వారిద్దరి కుటుంబ సభ్యులు బాలి చేరుకున్నారు. శుక్రవారం లోకేశ్వరన్ మృతదేహాన్ని, శనివారం ఉదయం విబుష్నియా మృతదేహాన్ని వెలికితీశారు.

Read Also:Cameron Green: గిల్ ఔట్ పై ఎందుకంత రాద్ధాంతం.. నేను కరెక్ట్ గానే పట్టుకున్నా..

బోల్తా పడిన స్పీడ్ బోట్
ప్రమాదానికి కారణం స్పీడ్‌ బోట్‌ బోల్తా పడడమేనని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. వీరిద్దరి మృతదేహాలను చెన్నైకి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా నుంచి చెన్నైకి నేరుగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఇద్దరి మృతదేహాలను ముందుగా మలేషియాకు తరలించి అక్కడి నుంచి భారత్‌కు తీసుకురానున్నారు. ఘటన సమాచారం అందిన వెంటనే సెన్నెర్‌కుప్పంలో శోకసంద్రం నెలకొంది. విభూషానియా కుటుంబం సెన్నెర్‌కుప్పంలో నివసిస్తోంది. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు లోకేశ్వరన్ ఇంట్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి. వారం రోజుల్లో లోకేశ్వరన్ అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడంటే స్నేహితులు నమ్మలేకపోతున్నారు. ప్రస్తుతం మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also:Toll Tax Hike: మళ్లీ పెరిగిన టోల్ ట్యాక్స్.. అమల్లోకి కొత్త ధరలు

Show comments