వైసీపీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ కొనియాడారు. పేదరిక నిర్మూలనకు దివ్య ఔషదం నవరత్నాలు ప్లస్ మ్యానిఫెస్టో అని పేర్కొన్నారు. నోటి వెంట ఒక మాట వస్తే అమలు చేసే సీఎంగా జగన్ పేరు తెచ్చుకున్నారని అన్నారు. రాజమండ్రిలో మంత్రి వేణు మీడియాతో మాట్లాడుతూ అలవికాని 600 హామీలు ఇచ్చి చంద్రబాబు వాటిని తుంగలో తొక్కారని ఆరోపించారు. మళ్లీ అదే మోసంతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో సూపర్ హిట్ అవుతుందని రాజానగరం వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా అభిప్రాయపడ్డారు. నయవంచన, వెన్ను పోట్లు ఒక వైపు, విశ్వసనీయత మరో వైపు పోటీ పడుతున్నాయని అన్నారు. వ్యవసాయం ఒక పండుగాగా జగన్ మార్చారని పేర్కొన్నారు. వ్యవసాయం, అక్వా రంగాలు ఉచితంగా ఉచిత విద్యుత్ అందిస్తామని, అన్నివర్గాల పేదవారికి సాయం చేసే కార్యక్రమం చేస్తున్నామని వివరించారు. టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలని , ఈ ఎన్నికల తర్వాత టిడిపి కనపడదని అన్నారు. కారణం లేకుండానే పవన్ పొత్తు పెట్టుకున్నాడని అన్నారు.
