Site icon NTV Telugu

SV University: ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచారం!

Cheetah

Cheetah

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ యూనివర్సిటీ)లో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. సోమవారం రాత్రి హెచ్ బ్లాక్ ప్రాంతంలో చిరుత సంచరించింది. చిరుతను చూసి విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. యూనివర్సిటీ సిబ్బంది వెంటనే పోలీస్, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు హెచ్ బ్లాక్ ప్రాంతంలో చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: Australian Open 2025: క్వార్టర్‌ఫైనల్‌కు సినర్‌.. ఎదురులేని స్వైటెక్‌!

కుక్కలు, దుప్పిల కోసం ఎస్వీ యూనివర్సిటీలోకి చిరుత వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. గతవారం జూ పార్క్ రోడ్డులో ఓ వ్యక్తిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. స్విమ్స్ హాస్పిటల్ వెనుక ఓ కుక్కను కూడా చంపింది. చిరుత జాడ కోసం 4 ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు బోన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కాలంగా తిరుపతిలో చిరుత సంచారం జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version