NTV Telugu Site icon

Cheetah-Tortoise Food: చిరుతతో ఫుడ్ పంచుకున్న తాబేలు.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో

Cheeta

Cheeta

Cheetah-Tortoise Food: సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తరువాత ఎక్కడ లేని వింతలు, విశేషాలు అక్కడే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో జరిగే అద్భుతాలన్నీ అక్కడే ప్రత్యక్షమవుతాయి. ఇలా ఊహకు కూడా ఇలా జరుగుతుందా అనిపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఓ చిరుత పులితో తాబేలు ఆహారాన్ని పంచుకుంటుంది. చిరుత తింటున్న ప్లేట్ లోనే తాబేలు కూడా మాంసాన్ని తీసుకొని తింటుంది. దీన్ని చూస్తే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందకు కంటే చిరుత, తాబేలు అనేవి విరుద్దమైన స్వభావాలను కలిగి ఉంటాయి. చూడటానికి ఆకారాల్లోనే కాదు అవి ఉండే విధానంలో కూడా చాలా తేడా ఉంటుంది.

Also Read: Supreme Court: “అత్తమామాలపై ప్రతీకారం కోసమే”.. వరకట్న వేధింపుల కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు..

చిరుత చాలా వేగంగా, యాక్టివ్ గా, బలంగా ఉంటుంది. అంతేకాకుండా మాంసాహారం మాత్రమే తింటుంది. ఇక తాబేలు విషయానికి వస్తే అది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నెమ్మదిగా ఉంటుంది. బద్ధకంగా ఉంటుంది. చిన్నగా కదులుతుంది. చూడటానికి చాలా చిన్న జీవి. కేవలం ఆకులు లాంటివి తినే సాధు జీవి. అయితే ఇవి రెండు కలిసి ఒకే ప్లేట్ లో తింటే ఎలా ఉంటుంది. చూడటానికే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. చిరుతను చూసి పెద్ద పెద్ద జీవులే భయపడిపోతాయి. అలాంటిది తాబేలు దానితో కలిసి ఫుడ్ షేర్ చేసుకోవడం అందులోనూ నాన్ వెజ్ చూస్తుంటే ఇలా ఎలా జరుగుతుంది అని అనిపిస్తుంటుంది. ఇక వీరి విరుద్ధమైన స్నేహాన్ని చూస్తుంటే మనిషి మనుగడలోనే కాదు ప్రకృతిలో ఉండే ప్రతి జీవిలో కూడా మార్పు వస్తున్నట్లు తెలుస్తోంది. మనుషులే కాదు జంతువులు కూడా అప్డేట్ అవుతున్నట్లు అర్థం అవుతుంది. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీనిని ఇప్పటికే 60,000 మందికి పైగా చూశారు. చూసిన ప్రతి ఒక్కరు ఈ విచిత్ర బంధాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిని హకన్ కపుకు అనే యూజర్ ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ‘చిరుత, తాబేలు ఆహారాన్ని పంచుకుంటున్నాయి. ఎవరైతే ఆహారాన్ని ఇస్తారో వారు తమ మనసును కూడా ఇస్తారు’ అంటూ క్యాప్షన్ జోడించి ఈ వీడియోను పోస్ట్ చేశారు.

 

 

 

Show comments