NTV Telugu Site icon

IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..

New Project (1)

New Project (1)

IRCTC : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలం నడుస్తోంది. ఇంటర్నెట్ చౌకకావడంతో చాలా మంది వినియోగదారులు తమ పనిని ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. బ్యాంక్‌ చెల్లింపులు, ఆన్ లైన్ కొనుగోళ్లు అన్నీ చిటికెలో పూర్తవుతున్నాయి. అలాగే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వాడకం బాగా పెరిగిపోయింది. ఇది కేవలం మెసేజింగ్ లేదా వీడియో కాలింగ్ కోసం మాత్రమే కాకుండా.. ఇప్పుడు దాని ద్వారా చెల్లింపులు కూడా చేయవచ్చు. అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారా నేరుగా మీ ఫోన్‌లో రైలు స్థితి, PNR స్టేటస్ పొందవచ్చు. వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సాప్ అనేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. IRCTCకి సంబంధించిన ప్రతి సమాచారాన్ని మీ నంబర్‌లో WhatsApp ద్వారా పొందవచ్చు.

వినియోగదారులు వాట్సాప్‌లో IRCTC రైలోఫీ చాట్‌బాట్ సేవ నుండి మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. వాట్సాప్ ద్వారా PNR స్టేటస్, రైలు స్థితిని ఎలా తనిఖీ చేయాలో తెలుసుకుందాం. మీరు WhatsAppలో PNR, రైలు స్థితిని సులభంగా తనిఖీ చేయవచ్చు. IRCTC యొక్క Railofy AI చాట్‌బాట్ ద్వారా, మీరు లైవ్ రైలు స్థితిని వీక్షించవచ్చు. ఇక్కడ మీరు మీ WhatsAppలో స్టేషన్ ముందు లేదా తదుపరి స్టేషన్ గురించి సమాచారాన్ని పొందవచ్చు.

Read Also: Kim Jong Un: కిమ్ చేష్టలు.. బుల్లెట్లు మిస్సైనందుకు ఏకంగా నగరం మొత్తం లాక్‌డౌన్

WhatsAppలో PNR, లైవ్ స్టేటస్‌ని తనిఖీ చేయాలనుకుంటే ముందుగా WhatsAppలో Relofi AI Chatbotని ఉపయోగించాలి. దీని కోసం IRCTC ఇచ్చిన +919881193322 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేయండి. నంబర్‌ను సేవ్ చేసిన తర్వాత ఓ సారి ఈ నంబర్‌ను వాట్సాప్ సెట్టింగ్‌లలో సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు AI చాట్‌బాట్‌తో కనెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు PNR నంబర్‌ను నమోదు చేసి, రైలు లైవ్ స్టేటస్, అది ఏ స్టేషన్‌కు చేరుకుంది, లేదా ఎంత ఆలస్యమైందో చెక్ చేయవచ్చు. అలా కాకుండా మీరు ఆహారాన్ని ఆర్డర్ చేయాలనుకుంటే, మీరు IRCTC Zoop యాప్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు లేదా స్టేషన్‌లో రైలు నుండి దిగాల్సిన అవసరం లేదు. రైల్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసి తినవచ్చు.

ఎలా ఉపయోగించాలి?
– దీని కోసం ముందుగా ఫోన్‌లో +91-9881193322 నంబర్‌ను సేవ్ చేయండి.
– వాట్సాప్‌లో రైలోఫీ చాట్‌ని తెరవండి.
– దీని తర్వాత 10 అంకెల PNR నంబర్‌ను నమోదు చేసి, WhatsAppలోని చాట్‌బాట్‌కు సందేశం పంపండి.
– దీని తర్వాత, ఇక్కడ మీరు రైల్వే చాట్‌బాట్ అయిన రైలోఫీపై లైవ్ రైలు అప్‌డేట్‌లను పొందుతారు.