NTV Telugu Site icon

OTP Frauds : కొత్త టెక్నాలజీతో ఓటీపీ మోసాలకు చెక్..

Otppp

Otppp

ఇటీవల సైబర్ నేరగాళ్ళు కొత్త పద్ధతులను ఫాలో అవుతూ మోసాలను చేస్తున్నారు. ఆన్ లైన్ లింక్ లను పెడుతూ అకౌంట్ ను ఖాళీ చేస్తున్నారు కొందరు.. అలాగే మరికొందరు మాత్రం ఓటీపీ పేరుతో మోసాలకు పాల్పడుతూ జనాలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై దృష్టి పెట్టింది.. ఓటీపి మోసాలకు చెక్ పెడుతూ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఈ టెక్నాలజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నేరగాళ్లు ఓటిపి పొందడానికి స్నేహితులుగా నటిస్తూ ఆన్లైన్ మోసాలకి పాల్పడుతున్నారు సిమ్ బ్యాన్, బ్యాంక్ ఖాతా మూసి వేయడం, విద్యుత్ కనెక్షన్ నిలిపివేయడం తో భయం వేసి ఏవైసీ పేరుతో ఇంకేమైనా కారణంగా ఓటీపీ రూపంలో ఆన్లైన్ మోసాలకి పాల్పడుతున్నారు. ఇలాంటి వాటి పై మనం కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిదని ప్రముఖులు చెబుతున్నారు.. తాజాగా ఇలాంటి మోసాలకు చెక్ పెడుతూ హోం మంత్రిత్వ శాఖ ఎస్బిఐ తో కలిసి కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది..

నేరగాళ్లు ఓటీపీ పంపినప్పుడు దాని ప్రస్తుత రిజిస్టర్డ్ బ్యాంక్ చిరునామా దాని ప్రస్తుత లొకేషన్ స్థానాన్ని గుర్తిస్తుంది ఈ రెండు చిరునామాలు సరైనవి అని తెలితేనే ఓటిపి నమోదు చేసిన తర్వాత మాత్రమే డబ్బులు చెల్లింపులు జరుగుతాయి.. లేకుంటే ఒక్క పైసా కూడా డబ్బులు కట్ అవ్వవు.. ప్రమాదం గురించి వినియోగదారులు హెచ్చరికను అందుకుంటారు. కస్టమర్ నోటీసు మీద కూడా ఓటీపీ బ్లాక్ చేయొచ్చు.. ఇలాంటి టెక్నాలజీ వల్ల ఎటువంటి మోసాలు జరగవని ప్రముఖులు తెలుపుతున్నారు..