Site icon NTV Telugu

Chatrapathi : ఎట్టకేలకు ఓటీటీ లో విడుదల కాబోతున్న ఛత్రపతి..?

Whatsapp Image 2023 08 14 At 8.43.55 Pm

Whatsapp Image 2023 08 14 At 8.43.55 Pm

టాలీవుడ్ యంగ్ హీరో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమా రీమేక్ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ రీమేక్ నార్త్ ఆడియెన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది.ఒరిజినల్‌ సినిమా లోని మ్యాజిక్‌ను హిందీ రీమేక్ మూవీ రీ క్రియేట్ చేయడంలో ఘోరంగా విఫలమైంది. థియేటర్లలో ఈ సినిమా డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది..ఛత్రపతి హిందీ రీమేక్ తోనే మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్టర్ గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.దాదాపు ఇరవై ఐదు కోట్ల భారీ బడ్జెట్‌తో ఛత్రపతి రీమేక్ మూవీ తెరకెక్కింది. కానీ ఐదు కోట్ల లోపే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్‌, కాన్సెప్ట్‌ మరియు సినిమా టేకింగ్‌పై ఎన్నో విమర్శలొచ్చాయి.

ఈ రీమేక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన నుష్రత్ బరుచా హీరోయిన్‌గా నటించింది. డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్‌లో తనకు వచ్చిన క్రేజ్‌ను చూసి ఛత్రపతి రీమేక్‌తో హిందీలో హిట్ అందుకోవాలనే బెల్లంకొండ శ్రీనివాస్ ఆలోచన అంతగా వర్కవుట్ కాలేదు. థియేటర్లలో ఈ సినిమా మే 12న ఎంతో గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లో భారీగా ప్రమోషన్స్ కూడా చేశారు.కానీ సినిమా ఫలితం ఆయనను నిరాశకు గురి చేసింది.అయితే ఈ మూవీ విడుదలైన చాలా రోజులకు ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుంది.ఆగస్ట్ 18 నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.ఛత్రపతి తెలుగు వెర్షన్‌కు ఎస్‌.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు.2005లో రిలీజైన ఈసినిమా భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతోనే ప్రభాస్ స్టార్ హీరోగా మారాడు.. ఆ సమయంలో ప్రభాస్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఛత్రపతి నిలిచింది. అయితే ఛత్రపతి రీమేక్ ఫలితం బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి రీమేక్స్ సినిమాల జోలికి వెళ్లకుండా చేసింది.

Exit mobile version