NTV Telugu Site icon

ChatGPT Search Engine: గూగుల్‌కు చెక్ పెట్టేందుకు చాట్‌జీపీటీ సెర్చ్‌ఇంజిన్‌ రెడీ..

Open Ai

Open Ai

ChatGPT Search Engine: ఓపెన్‌ ఏఐ (OpenAI) మరొక కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటి వరకు కేవలం ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇస్తున్న చాట్‌జీపీటీలో సెర్చ్‌ ఇంజిన్‌ సామర్థ్యాలను జోడించి అందించనుంది. ఈ సెర్చ్ ఇంజిన్‌లో గూగుల్ గుత్తాధిపత్యం కొనసాగుతుండగా.. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం చూస్తే అతి తక్కువ కాలంలో గూగుల్ కు చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ కొత్త ఫీచర్‌తో, వినియోగదారులు ఇప్పుడు వెబ్ లింక్‌ల గురించి అసలైన సమాచారాన్ని తక్షణమే పొందవచ్చని OpenAI తెలిపింది. ఇకపై మునుపటిలా సెర్చ్ ఇంజన్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని తెలిపింది.

Also Read: Vikkatakavi : తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ లో రిలీజ్ కానున్న‘వికటకవి’

ChatGPT హోమ్ పేజీలో కొత్తగా సెర్చ్‌ ఆప్షన్‌ కలిగి ఉంటుంది. ఇందులో వార్తలు, క్రికెట్ స్కోర్‌లు, ఇంకా ప్రమోషన్‌ల వంటి సమాచారాన్ని అక్కడి నుండి యాక్సెస్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. OpenAI ప్రకారం, కొత్త ఫీచర్ chatgpt.com వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఫీచర్ ఈరోజు నుండి చాట్‌జీపీటీ ప్లస్‌, టీమ్‌ యూజర్లు, సెర్చ్‌జీపీటీ వెయిట్‌ లిస్ట్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వ్యాపారం, విద్య వినియోగదారులకు కొన్ని వారాల్లో ఈ అవకాశం లభిస్తుంది. కొన్ని నెలల్లో ChatGPTని ఉపయోగించే వారికి ఈ ఫీచర్ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని ఓపెన్ AI తెలిపింది. ఇప్పటి వరకు వినియోగదారుడు ఏదైనా అభ్యర్థించినప్పుడు మాత్రమే chatgpt తన డేటాబేస్‌లో ఉన్న సమాచారాన్ని అందుబాటులో ఉంచింది.