Site icon NTV Telugu

ChatGPT JEE Exam : చాట్ జీపీటీ అన్నింట్లో పాసైంది.. కానీ జేఈఈలో మాత్రం ఫెయిల్.. !

Chat Ji Peet

Chat Ji Peet

చాట్ జీపీటీ ప్రస్తుతం ఈ పేరు వింటేనే చాలు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే.. చాట్ జీపీటీ చేయలేనిది ఏమీ లేదు. ఎలాంటి స్క్రిప్ట్ లైనా రాయగలదు. కష్టతరమైన సైతం క్షణాల్లో పరిష్కరించగలదు. అందుకే చాట్ బాట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ప్రతిదీ..కేక్ వాక్ దాదని తేలిపోయింది. అందులోనూ భారత్ ప్రతిష్టాత్మకమైన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ డ్ ను క్లియర్ చేయడం అంత ఈజీ కాదని నిరూపితమైంది. ఏ1 ఆధారిత చాట్ జీపీటీ జేఈఈ ఎగ్జామ్ క్రాక్ చేయడంలో ఫెయిల్ అయింది. జేఈఈ ఎగ్జామ్ అనేది చాలా కష్టతరమైంది. భారత్ లో అగ్రశ్రేణి ఇంజనీరింగ్ సంస్థలలో అడ్మిషన్ పొందాలంటే ఆశించే వేలాది మంది విద్యార్థులకు జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెద్ద టాస్క్.. అలాంటి జేఈఈ పరీక్షలో చాట్ జీపీటీ పర్ఫామెన్స్ నిరాశపరిచింది.

Read Also : Siddarth Madhavan: ఈ కాంబినేషన్ లో సినిమా అంటే మాములుగా ఉండదు

అయితే చాట్ జీపీటీ కేవలం రెండు పేపర్ల మొత్తం 11 ప్రశ్నలను మాత్రమే పరిష్కరించిందని ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ్ గోపాల్ రావు వెల్లడించారు. జేఈఈ అనేది సంక్లిష్టమైన కాంప్లెక్స్ డయాగ్రామ్స్, ఫిగర్స్ కలిగి ఉంటుంది. క్రాక్ చేయడంలో అత్యంత కఠినమైన పరీక్ష అని అన్నారు. అలాంటి జేఈఈ పరీక్షను క్రాక్ చేయడం అనేది చాట్ జీపీటికి అతి పెద్ద సవాలుగా మారింది. అమెరికా నిర్వహించిన అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించింది. కానీ.. జేఈఈ పరీక్షల్లో చాట్ జీపీటీ పెద్దగా స్కోర్ చేయలేకపోయింది. ఏఐ మోడల్ గతంలో అనేక ప్రతిష్టాత్మకమైన.. సవాలు చేసే పరీక్షలలోనూ ఉత్తీర్ణత సాధించింది. అలాగే నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ లో అభ్యర్థులు తప్పనిసరిగా 200 ప్రశ్నలకు 180 ప్రశ్నలకు సమాధానమివ్వాలి.. చాట్ జీపీటీ ఆకట్టుకునేలా ప్రయత్నించి మొత్తం 200 ప్రశ్నలకు సమాధానమిచ్చింది. చాట్ జీపీటీ పనితీరు ఫలితంగా 800కి మొత్తం 395 స్కోర్ వచ్చింది. గత ఏడాదిలో కటాప్ మార్కులకు ఇది సమానం. కానీ.. 45 శాతానికి మాత్రమే చాట్ జీపీటీ పరిష్కరించగలదని తేలింది.

Read Also : Minister Vishwaroop: హరీష్‌రావు కామెంట్లకు ఏపీ మంత్రి కౌంటర్.. హాస్యాస్పదం..

ముఖ్యంగా.. నీట్ పరీక్షల్లోని జీవశాస్త్ర విభాగంలో మాత్రమే చాట్ జీపీటీ అద్భుతంగా ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చింది. ఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షల్లో విఫలమైనప్పటికీ.. నీట్ పరీక్షలో చాట్ జీపీటీ పర్ఫార్మెన్స్ ఇతర రంగాలలో రాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని సూచిస్తుంది. చాట్ జీపీటీ అనేది ఏ1 పవర్డ్ లాంగ్వేజ్ మోడల్.. ఇది ఒక లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ టూల్.. ఏదైన సారంశాన్ని అందించడంతో పాటు అనేక ప్రశ్నలకు సమాధానమివ్వడం వంటి అనేక రకాల పనులను క్షణాల వ్యవధిలో పూర్తి చేయడంలో ట్రైనింగ్ పొందింది. ఈ ఏ1 మోడల్ విశేషమైన సామర్థ్యాలతో తక్కువ వ్యవధిలోనే విస్తృతంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఉద్యోగాలపై అనిశ్చితిని కలిగేలా చేసింది. జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలో చాట్ జీపీటికీ ఎదురుదెబ్బ తగలడంతో అధునాతన ఏ1 మోడల్ కు పరిమితులు ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. ఏ1 అనేక రంగాలలో విప్లవాత్మక మార్పులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Exit mobile version