NTV Telugu Site icon

Charging Phone At Work: ఆఫీస్ లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్న ఉద్యోగి.. బాస్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Charging

Phone Charging

ఉద్యోగం చేస్తున్నామంటే రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. వర్క్ టార్గెట్ ప్రెజర్ ఒకెత్తైతే , బాస్, కోలిగ్స్ నుంచి ఉండే ప్రెజర్ మరొకటి. ఇక ఎంతో మంది ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకోలేక తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఇలాంటి వాటి గురించే చాలా మంది తమ సోషల్ మీడియా ద్వారా తరచూ పంచుకుంటున్నారు. అలాంటి ఓ ఘటన గురించే ఓ వ్యక్తి రెడ్డిట్ ద్వారా తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు.ఆఫీస్ లో తన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నందుకు అతనిపై వాళ్ల బాస్ అరచినట్లు ఆ వ్యక్తి రాసుకొచ్చాడు. ఆఫీస్ లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నావంటే నీవు ఆఫీస్ కరెంట్ ను దొంగలిస్తున్నావని అర్థమని తనపై కోప్పడినట్లు ఆ ఉద్యోగి వివరించాడు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందువల్ల తాను రాత్రి పూట నిద్రపోయే ముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయానని ఆ వ్యక్తి తెలిపాడు. తాను డెస్క్ వర్క్ చేస్తానని పేర్కొ్న్నాడు. తన బాస్ ఎందుకు ఇలా అన్నాడో అర్థం కావడం లేదని తెలిపాడు.

Also Read: Flood Watch: వచ్చేసిన ‘ఫ్లడ్ వాచ్ యాప్’.. ఇక వరద సమాచారం ఇట్టే తెలుసుకోవచ్చు

ఇక ఈ పోస్ట్ చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. అంటే ఆఫీస్ వాతావరణంలో గాలి పీల్చుకున్నందుకు గాలి దొంగతనం చేశారని, వాటర్ తాగినందుకు నీటిని దొంగతనం చేశారంటారేమో అని కొంతమంది వెటకారంగా కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆఫీసులో ఉపయోగించే ఫ్రిడ్జ్, కాఫీ మిషన్, ఏసీల విద్యుత్ వినియోగంతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆ మాత్రం ఆ బాస్ కు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. టాయిలెట్ కు వెళ్లి ఫ్లష్ చేస్తే వాటర్ దొంగతనం అవుతుంది మీ బాస్ ను వాష్ రూం కు వెళ్లొద్దని చెప్పు అని మరికొందరు ఆ ఉద్యోగికి సలహా ఇస్తు్న్నారు. ఇక ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఆ వ్యక్తి ‘మా బాస్ ను ఉద్యోగం నుంచి తీసేశారంటా, నాకు ఇప్పుడే తెలిసింది. ఆయన ఈ నెల తరువాత ఆఫీస్ విడిచి వెళ్లిపోతున్నాడు’ అంటూ పోస్ట్ చేశాడు.

ఇక దీనిపై కూడా నెటిజన్లు స్పందించారు. అదీ సంగతీ ఆ కోపం అంతా మీ బాస్ నీ మీద చూపించాడు అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా 10 నిమిషాలు టాయిలెంట్ బ్రేక్ తీసుకున్నందుకు బాస్ తిట్టాడంటూ ఉద్యోగంలో చేరిన మూడురోజులకే మానేసినట్లు ఓ మహిళ తెలిపిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఒత్తిళ్లు తట్టుకోలేక గతేడాదిలో 50 మిలియన్ల మంది తమ ఉద్యోగాన్ని వదులుకున్నట్లు పలు నివేదికలు పేర్కొ్న్నాయి. ఈ నేపథ్యంలో ఛార్జింగ్ దొంగతనం గురించి ఈ ఉద్యోగి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Show comments