హిమాలయ దేవాలయాలకు యాత్ర ప్రారంభమైన ఒక రోజు తర్వాత శనివారం చార్ ధామ్ పుణ్యక్షేత్రాల వద్ద భారీ సంఖ్యలో యాత్రికులు కనిపించారు. యమునోత్రి వద్ద భారీగా రద్దీ ఉంది. మొదటి రోజు సుమారు 45,000 మంది యాత్రికులు దర్శనమ్ చేసుకున్నారు. ప్రజలు ఆలయానికి వెళ్లే ఇరుకైన మార్గంలో నడవడం కూడా కష్టమైంది. కేదార్నాథ్ లో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. అక్కడ మొదటి రోజు సుమారు 30,000 మంది వచ్చారు. ఇంతలో, ఇద్దరు యాత్రికులు మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన రామ్గోపాల్ (71), ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావ్కు చెందిన విమలా దేవి (69) యమునోత్రిలో శుక్రవారం గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు.
Also read: Heavy Traffic Jam: ఇంకా క్లియర్ కాలె.. పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
శనివారం, బార్కోట్ నుండి జానకీచట్టి వరకు వివిధ ప్రదేశాలలో యాత్రికులు చిక్కుకుపోయారు. తెల్లవారుజాము వరకు వాహనాల పొడవైన క్యూలు విస్తరించి ఉన్నాయి. ట్రెక్కింగ్ మార్గంలోనే రద్దీ భక్తులకు గణనీయమైన సవాళ్లను ఎదురుకున్నారు. ఓ యాత్రికుడు సునీల్ మాండవియా మాట్లాడుతూ.., “మేము ఒక అంగుళం కూడా కదలకుండా మా కారులో ఏడు గంటలు కూర్చోవాల్సి వచ్చింది. మా ఆహారం, నీరు అన్నీ అయిపోయాయి, ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అయ్యి యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో మాకు తెలియదు “అని చెప్పారు.
Also read: RCB vs DC: చావో.. రేవో.. ప్లేఆప్స్ కు చేరువయ్యేది ఎవరో..
యమునోత్రి జాతీయ రహదారిపై ఇరుకైన, సంక్లిష్టమైన ప్రదేశాలలో ట్రాఫిక్ ను వన్-వే సిస్టమ్ ద్వారా నియంత్రిస్తున్నట్లు ఆ ప్రాంత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ముఖేష్ రామోలా తెలిపారు. “దీనిని నిర్ధారించడానికి, దామ్టా, దోబాటా, పాలిగడ్, రాణాచట్టి, ఫూల్చట్టిలో వాహనాలను కొంతకాలం నిలిపివేస్తున్నారు. అలాగే నియంత్రిత పద్ధతిలో ముందుకు సాగడానికి ఆహారం, నీటిని అందిస్తున్నారు” అని ఆయన చెప్పారు. ఉత్తరకాశి జిల్లా మేజిస్ట్రేట్ మెహర్బన్ సింగ్ బిష్త్ మాట్లాడుతూ., మొదటి రోజు యమునోత్రి ట్రెక్ మార్గంలో స్థానిక గ్రామస్తులు, బయటి నుండి యాత్రికులు పెద్ద సంఖ్యలో గుమిగూడినందున భారీ జనసమూహం ఉందని చెప్పారు. “శనివారం నాటికి పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయి” అని ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్ర పర్యాటక శాఖ ప్రకారం, చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ గణాంకాలు ఇప్పటికే 23 లక్షలు దాటాయి. కేదార్నాథ్ ఆలయానికి అత్యధికంగా 8,07,090, బద్రీనాథ్ కు 7,10,192, గంగోత్రికి 4,21,205, యమునోత్రికి 3,68,302 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. అదనంగా, హేమకుండ్ సాహిబ్ కోసం 50,604 రిజిస్ట్రేషన్లు జరిగాయి.