ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే గ్రామీ అవార్డ్స్-2026 (Grammy Awards 2026) వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక వేదికపై ప్రతి ఏటా సంగీత కళాకారులు తమ ప్రతిభతోనే కాకుండా, వినూత్నమైన ఫ్యాషన్ దుస్తులతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా అమెరికన్ గాయని చాపెల్ రోన్ తన సాహసోపేతమైన డ్రెస్సింగ్‌తో రెడ్ కార్పెట్‌పై హాట్ టాపిక్‌గా మారారు.
ఈ వేడుకల్లో చాపెల్ రోన్ దాదాపు టాప్‌లెస్ అనిపించేలా పారదర్శకమైన “షీర్ డ్రెస్” (Sheer Dress) ధరించి ప్రత్యక్షమయ్యారు. తన శరీరానికి ప్రత్యేకమైన బాడీ ఆర్ట్ (Body Art) జోడించి, అత్యంత ధైర్యంగా రెడ్ కార్పెట్‌పై నడిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆమె లుక్‌కు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాపెల్ రోన్ ధరించిన ఈ దుస్తులు గ్రామీ అవార్డ్స్ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైనవి (Boldest) అని ఫ్యాషన్ నిపుణులు పేర్కోంటున్నారు. గతంలో ఎందరో తారలు వెరైటీ దుస్తుల్లో కనిపించినా, చాపెల్ రోన్ ఎంచుకున్న ఈ బాడీ ఆర్ట్ అండ్ షీర్ డ్రెస్ కాంబినేషన్ మాత్రం ఒక కొత్త రికార్డును సెట్ చేసిందని చెప్పవచ్చు.
