NTV Telugu Site icon

Chandrayaan3: వెల్ కమ్ బడ్డీ… చంద్రయాన్ 2 ఆర్బిటర్ తో లింక్ అయిన విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్

Chandrayaan

Chandrayaan

ఇస్రో శాస్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం ఆశగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది గంటల్లోనే రాబోతుంది. ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ కానుంది చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్‌. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలకప్రకటన చేసింది. చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం కాకపోయినప్పటికీ ఆ ప్రయోగంలో భాగంగా పంపిన ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతోందని.. ఆ ఆర్బిటర్‌ను చంద్రయాన్‌ 3 లోని విక్రమ్ ల్యాండర్‌‌ మాడ్యుల్‌కు విజయవంతంగా లింక్ చేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుని పైకి పంపించిన ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. 8 సాంకేతిక పరికరాలను కలిగి ఉన్న ఈ ఆర్బిటర్‌ మాత్రం ఇప్పటికీ చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఆ ఆర్బిటర్‌లో ఏడేళ్లకు సరిపడా ఇంధనం ఉందని అంటే అది అంతకాలం పాటు చంద్రని చుట్టూ తిరుగతుందని ఇస్రో అప్పట్లోనే తెలిపింది. ఈ కారణంగానే చంద్రయాన్‌ 3 లో ఆర్బిటర్‌ను ఇస్రో పంపలేదు. అందువల్లే  చంద్రయాన్ 3 ప్రయోగంలో  ఆర్బిటల్ లేదు. దీనికి సంబంధించి ట్వీట్ చేసిన ఇస్రో చంద్రయాన్ 2 ఆర్బిటర్ చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ ను స్వాగతించిందని పేర్కొంది. వీటి మధ్య డేటా ట్రాన్స్ ఫర్ సిస్టమ్ ఏర్పాటు అయినట్లు వెల్లడించింది. ఇదిలా వుండగా  చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్‌ ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం బుధవారం 5.20 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఇస్రో పేర్కొంది. మరొక విషయాన్నా కూడా ఇస్రో తెలిపింది. ల్యాండర్‌ మాడ్యుల్‌ను చేరుకునేందుకు బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్‌, కమాండ్‌ నెట్‌వర్కింగ్‌ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు ఉన్నాయని ఇస్రో వెల్లడించింది.

Also Read: Viral News: చనిపోయిన నాలుగేళ్ల తర్వాత వచ్చిన తీర్పు.. అసలేం జరిగిందంటే?

ఇక చంద్రయాన్-3 ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అవాయిడెన్స్ కెమెరా తీసిన జాబిల్లి చిత్రాలను ఇస్రో విడుదల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బండరాళ్లు లేదా లోతైన గుంతలు లేకుండా సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించడంలో ఈ కెమెరా సహాయపడుతుందని ఇస్రో ప్రకటించింది. ఒక్కో ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటూ వెళుతున్న చంద్రయాన్ 3 రేపు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయితే ప్రపంచంలో ఆ ఘనత సాధించిన తొలిదేశంగా భారత్ కీర్తి పతాకం రెపరెపలాడటం గ్యారెంటీ.