NTV Telugu Site icon

Chandrayaan 3 Live Updates: చంద్రయాన్‌ – 3 ల్యాండింగ్‌ విజయవంతం

Chandrayaan 3

Chandrayaan 3

Chandrayaan 3 Live Updates: చంద్రయాన్‌ – 3 విజయవంతంగా జాబిల్లమ్మపై ల్యాండ్‌ అయ్యింది.. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టింది చంద్రయాన్‌-3.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన తొలి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది.. ఇక, చంద్రుడిపై కాలుమోసిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది.. చంద్రయాన్-3 ప్రయాణం.. మూన్‌ మిషన్‌ విజయవంతంపై ప్రముఖుల స్పందనలు మీ కోసం..

The liveblog has ended.
  • 23 Aug 2023 09:59 PM (IST)

    చంద్రయాన్‌ -3 సక్సెస్.. భారత్‌కు రష్యా అధ్యక్షుడు అభినందనలు

    చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండింగ్ అయినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని అభినందించారు." భారత అంతరిక్ష నౌక చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ అయిన సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. ఇది అంతరిక్ష పరిశోధనలో పెద్ద ముందడుగు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఖచ్చితంగా భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతికి నిదర్శనం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నాయకత్వం, సిబ్బందికి కొత్త విజయాలు సాధించినందుక నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను." అని రష్యా అధ్యక్షుడు అన్నారు.

  • 23 Aug 2023 06:28 PM (IST)

    చంద్రయాన్‌-3 విజయవంతంతో నా జీవితం ధన్యమైంది

    చంద్రయాన్‌-3 విజయంతో నా జీవితం ధన్యమైంది అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ఆయన.. భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు.. ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలు.. చంద్రయాన్‌-3 విజయం నవభారత జయధ్వానం.. బ్రిక్స్‌ సమావేశాల్లో ఉన్నా నా మనసంతా చంద్రయాన్‌-3 పైనే ఉందన్నారు.. చంద్రయాన్‌-3 బృందం, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు.. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా.. అద్భుత విజయం కోసం 140 కోట్ల ప్రజలు ఎదురుచూశారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ

  • 23 Aug 2023 06:19 PM (IST)

    ఇస్రోకి కంగ్రాట్స్:మోహన్ బాబు

  • 23 Aug 2023 06:18 PM (IST)

    ప్రతి ఇండియన్ గుండె ఉప్పొంగుతోంది : కళ్యాణ్ రాం

  • 23 Aug 2023 06:17 PM (IST)

    భారత్ మాతాకీ జై: మంచు విష్ణు

  • 23 Aug 2023 06:17 PM (IST)

    ఇస్రో టీంకి సాష్టాంగ నమస్కారం: సత్యదేవ్

  • 23 Aug 2023 06:16 PM (IST)

    ఈరోజు చరిత్ర సృష్టించారు: చిరంజీవి

  • 23 Aug 2023 06:15 PM (IST)

    మీరే మా మా ప్రైడ్: ఎన్టీఆర్

  • 23 Aug 2023 06:14 PM (IST)

    చంద్రయాన్‌ - 3 ల్యాండింగ్‌ విజయవంతం.. ఇస్రో ప్రకటన

  • 23 Aug 2023 06:13 PM (IST)

    చంద్రయాన్ -3 విజయవంతం.. గర్వంగా ఉందంటూ రాజమౌళి ట్వీట్

  • 23 Aug 2023 06:04 PM (IST)

    చరిత్ర సృష్టించిన భారత్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్

    Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండమ్ విజయవంతంగా ల్యాండ్ అయింది. శాస్త్రవేత్తలు ఊహించని మేరకే ల్యాండింగ్‌ ప్రక్రియ విజయవంతమైనట్లు తెలిసింది.

  • 23 Aug 2023 05:51 PM (IST)

    చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ప్రక్రియ షురూ

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌ ల్యాండింగ్ ప్రక్రియ మొదలైంది. జాబిల్లి ఉపరితలం వైపు ల్యాండర్‌ ప్రయాణం మొదలైంది. ల్యాండర్‌ నుంచి వస్తున్న సిగ్నల్స్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో చివరి 17 నిమిషాలు అత్యంత కీలకంగా మారనుంది. ఇంకోవైపు క్షణక్షణం ఉత్కంఠ రేకెత్తిస్తుండడంతో యావత్‌ భారత్‌, మరోవైపు ప్రపంచం ఎదురు చూస్తోంది.

  • 23 Aug 2023 05:48 PM (IST)

    జాబిల్లికి చేరువలో విక్రమ్ ల్యాండర్

    జాబిల్లిపై కాసేపట్లో విక్రమ్‌ ల్యాండర్‌ ల్యాండింగ్‌ కానుంది. సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై ల్యాండర్‌ దిగనుంది.

  • 23 Aug 2023 05:25 PM (IST)

    చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం

    చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండింగ్ కోసం ఇస్రో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించింది.  విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ 30 నిమిషాల కంటే తక్కువ సమయంలో చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది సాయంత్రం 6:04 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది.

     

     

  • 23 Aug 2023 05:19 PM (IST)

    చంద్రయాన్-3 కోసం సీమా హైదర్ ఉపవాస దీక్ష

    చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావాలంటూ సీమా హైదర్ ఉపవాస దీక్ష చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, చంద్రయాన్ -3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయ్యే వరకు సీమా ఉపవాస దీక్షకు కట్టుబడి ఉంది. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కోసం సీమా హైదర్ ఉపవాస దీక్షను పాటిస్తున్నారు. రాధే-కృష్ణ భగవానుని తాను గాఢంగా విశ్వసిస్తానని, మిషన్ విజయవంతానికి దేవతలందరి ఆశీర్వాదాలు కోరుతున్నానని ఆమె చెప్పారు. కొవిడ్ -19 మహమ్మారి సమయంలో పబ్జీ ఆడుతున్నప్పుడు గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న 22 ఏళ్ల భారతీయ వ్యక్తి సచిన్ మీనాతో తాను ప్రేమలో పడ్డానని 30 ఏళ్ల పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ చెప్పారు. ఇప్పటికే గులాం హైదర్‌తో వివాహమై నలుగురు పిల్లలతో ఉన్న సీమా.. సచిన్‌తో కలిసి ఉండేందుకు పాకిస్థాన్‌ను విడిచి అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది.

     

     

  • 23 Aug 2023 05:13 PM (IST)

    దక్షిణాఫ్రికా నుంచి చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ను వీక్షించనున్న ప్రధాని

    బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా నుంచి చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించనున్నారు. "చంద్రయాన్ ల్యాండింగ్ సమయంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇస్రోతో కనెక్ట్ అవుతారు" అని అధికారిక వర్గాలు తెలిపాయి.

  • 23 Aug 2023 05:02 PM (IST)

    చంద్రయాన్‌ కోసం సూర్యుడికి పూజలు..

    చంద్రయాన్ 3 విజయవంతం కావాలంటూ సూర్యుడికి పూజలు నిర్వహించారు.. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో VHP, బజరంగ్‌దల్‌ కార్యకర్తలు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఇక, ఆలయంలో కొట్టిన టెంకాయలో పువ్వు ప్రత్యక్షం కావడంతో.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొబ్బరికాయలో పువ్వు రావడం విజయానికి సంకేతం అంటున్నారు..

  • 23 Aug 2023 04:44 PM (IST)

    చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్..

  • 23 Aug 2023 04:36 PM (IST)

    అంతా అనుకూలమే.. ఆలస్యమయ్యే సూచనలు లేవు: ఇస్రో

    ల్యాండింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ విక్రమ్‌తో అంతా బాగుందని ఇస్రో తెలిపింది. ఎలాంటి జాప్యం జరిగినట్లు ఎలాంటి నివేదిక లేదు. ఏవైనా సమస్యలుంటే ఆగస్ట్ 27కి ల్యాండింగ్‌ను మారుస్తామని ఇస్రో ముందే చెప్పింది. అయితే ప్రస్తుతానికి సాయంత్రం 5:44 గంటలకు ల్యాండింగ్ సీక్వెన్స్ ప్రక్రియకు అనుకూలంగా కనిపిస్తోంది.

  • 23 Aug 2023 04:14 PM (IST)

    చంద్రుడి ఉపరితలాన్ని తాకబోతున్నాం: సీనియర్‌ సైంటిస్ట్ సత్యనారాయణ

    చంద్రుని ఉపరితలాన్ని తాకని దేశాల జాబితాలో భారత్‌ చేరబోతోందని.. వైఫల్యాలు పాఠాలు నేర్పుతాయని, తాము చాలా నేర్చుకున్నామని చంద్రయాన్-3 ల్యాండింగ్‌పై సీనియర్ శాస్త్రవేత్త సీఎస్‌ఐఆర్ సత్యనారాయణ చెప్పారు. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ఈ రోజు సాఫ్ట్‌ల్యాండింగ్‌ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

     

  • 23 Aug 2023 04:01 PM (IST)

    అది జరిగితే భారత్‌ కొత్త రికార్డు

    చంద్రయాన్‌-3 ప్రయోగంలో కీలక ఘట్టానికి రంగం సిద్ధం అయ్యింది.. జాబిల్లి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్నారు.. చంద్రయాన్‌ 2 వైఫల్యం దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఇస్రో.. ఈ సారి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ఖాయమంటున్నారు.. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ విజయవంతమైతే అంతరిక్ష చరిత్రలో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించనుంది.

  • 23 Aug 2023 03:56 PM (IST)

    ఆ 15 నిమిషాలు కీలకం

    నేడు చివరి 15 నిమిషాలు పూర్తిగా కంప్యూటర్‌ గైడెడ్. అన్ని సెన్సర్లు ఫెయిలైనా, ల్యాండింగ్‌ అయ్యేలా ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను రూపొందించాం. 2 ఇంజిన్లు ఫెయిలైనా సజావుగా ల్యాండింగ్‌ అయ్యేలా ప్లాన్‌. వర్టికల్‌ ల్యాండింగ్‌ అత్యంత కీలకం అని ఇస్రో అధికారులు వెల్లడించారు.

  • 23 Aug 2023 03:56 PM (IST)

    సాఫ్ట్‌ ల్యాండింగ్ కావాలని దర్గా వద్ద పూజలు

    విక్రమ్ ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్ కావాలని దేశవ్యాప్తంగా పలు దేవాలయాల్లో పూజలు జరుగుతున్నాయి. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావాలని శ్రీనగర్‌లోని హజ్రత్‌బాల్ దర్గా వద్ద ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.