బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరియు కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ లారెన్స్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2.. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు ఈ సినిమాను డైరెక్టర్ వాసు సీక్వెల్ గా తెరక్కించాడు. ఈ సినిమా కు విడుదల ముందు భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. భారీ హైప్ తో ఈ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా విడుదల అయింది.అయితే విడుదల అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది.కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించడం,అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించడం, లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో భారీ అంచనాల నడుమ పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైన ఈ సీక్వెల్ చంద్రముఖి మ్యాజిక్‌ను రిపీట్ చేయలేపోయింది. దాదాపు 60కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నలభై కోట్లలోపే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు 20 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.తెలుగు వెర్షన్ అయితే డిజాస్టర్‌గా నిలిచింది. రజనీకాంత్ చంద్రముఖి తరహాలో హారర్, థ్రిల్లింగ్ అంశాలు ఈ సీక్వెల్‌లో మిస్సయ్యాయనే విమర్శలొచ్చాయి.
చంద్రముఖి 2 సినిమాలో మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సుభీక్ష ప్రధాన పాత్రలు పోషించారు.ఇదిలా ఉంటే థియేటర్ లో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోన్నట్లు సమాచారం.తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చంద్రముఖి 2 రిలీజ్ కానున్నట్లు తెలిసింది. చంద్రముఖి 2 కథ విషయానికి వస్తే చంద్రముఖి ప్యాలెస్ నుంచి చాలా ఏళ్ల క్రితం వెళ్లిపోయిన ఆత్మ మళ్లీ తిరిగొస్తుంది. మదన్ (లారెన్స్) కుటుంబాన్ని ఇబ్బందిపెడుతుంది. చంద్రముఖి ఆత్మ బారి నుంచి మదన్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ సినిమా కథ.అయితే ఓటీటీ రిలీజ్‌కు ముందే చంద్రముఖి 2 సినిమా ఆన్‌లైన్‌లో లీకైంది. తమిళ వెర్షన్‌కు సంబంధించి హెచ్‌డీ ప్రింట్ పైరసీ సైట్‌తో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కనిపించడంతో ఈ సినిమా యూనిట్ వెంటనే అప్రమత్తం అయింది.