Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Chandramukhi 2 Ott Release Date Fix Streaming Soon

Chandramukhi 2 : చంద్రముఖి 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?

NTV Telugu Twitter
Published Date :October 17, 2023 , 8:02 am
By Murali Krishna
Chandramukhi 2 : చంద్రముఖి 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరియు కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ లారెన్స్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2.. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు ఈ సినిమాను డైరెక్టర్  వాసు సీక్వెల్ గా తెరక్కించాడు. ఈ సినిమా కు విడుదల ముందు భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. భారీ హైప్ తో ఈ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా విడుదల అయింది.అయితే విడుదల అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది.కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించడం,అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్‌ అందించడం, లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో భారీ అంచనాల నడుమ పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైన ఈ సీక్వెల్‌ చంద్రముఖి మ్యాజిక్‌ను రిపీట్ చేయలేపోయింది. దాదాపు 60కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నలభై కోట్లలోపే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు 20 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.తెలుగు వెర్షన్ అయితే డిజాస్టర్‌గా నిలిచింది. రజనీకాంత్ చంద్రముఖి తరహాలో హారర్‌, థ్రిల్లింగ్ అంశాలు ఈ సీక్వెల్‌లో మిస్సయ్యాయనే విమర్శలొచ్చాయి.

చంద్రముఖి 2 సినిమాలో మహిమా నంబియార్‌, లక్ష్మీ మీనన్‌, సుభీక్ష ప్రధాన పాత్రలు పోషించారు.ఇదిలా ఉంటే థియేటర్ లో నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోన్నట్లు సమాచారం.తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చంద్రముఖి 2 రిలీజ్ కానున్నట్లు తెలిసింది. చంద్రముఖి 2 కథ విషయానికి వస్తే చంద్రముఖి ప్యాలెస్ నుంచి చాలా ఏళ్ల క్రితం వెళ్లిపోయిన ఆత్మ మళ్లీ తిరిగొస్తుంది. మదన్ (లారెన్స్‌) కుటుంబాన్ని ఇబ్బందిపెడుతుంది. చంద్రముఖి ఆత్మ బారి నుంచి మదన్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నదే ఈ సినిమా కథ.అయితే ఓటీటీ రిలీజ్‌కు ముందే చంద్రముఖి 2 సినిమా ఆన్‌లైన్‌లో లీకైంది. తమిళ వెర్షన్‌కు సంబంధించి హెచ్‌డీ ప్రింట్ పైరసీ సైట్‌తో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కనిపించడంతో ఈ సినిమా యూనిట్ వెంటనే అప్రమత్తం అయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #kanganaranaut
  • Chandramukhi 2
  • lawrence
  • OTT
  • release

తాజావార్తలు

  • US: మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి

  • Iran Supreme Leader: ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ.. వేరే దేశానికి మకాం మార్చే ఛాన్స్..?

  • Coolie : ‘చికిటు’ లిరికల్ సాంగ్.. యావరేజ్ రెస్పాన్స్

  • Kanaka Durgamma: నేటి నుంచి ఇంద్రకిలాద్రిపై వారహి నవరాత్రులు, ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాలు!

  • Ashok Gehlot: రాజస్థాన్ సీఎంను తొలగించడానికి కుట్ర.. మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • TECNO Spark Go 2: మొబైల్‌లో సిగ్నల్ లేకున్నా పనిచేసే ఫీచర్‌.. కేవలం రూ. 6,999కే వచ్చేసిన ‘స్పార్క్ గో 2’ మొబైల్..!

  • Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!

  • Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ D ఎలా తోడ్పడుతుందంటే..?

  • BSNL Launches Quantum 5G FWA: 5G విప్లవానికి నాంది.. బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G FWA సేవలు రూ.999 నుంచే ప్రారంభం..!

  • boAt Airdopes Prime 701 ANC: 50 గంటల ప్లేబ్యాక్‌, 46dB నాయిస్ క్యాన్సిలేషన్ తో వచ్చేసిన కొత్త ఇయర్‌బడ్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions