Site icon NTV Telugu

Chandramukhi 2 Audio Launch : ట్రెడిషన్ వేర్ లో అదరగొట్టిన కంగనా రనౌత్..

Whatsapp Image 2023 08 25 At 11.08.15 Pm

Whatsapp Image 2023 08 25 At 11.08.15 Pm

కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ హీరో గా దర్శకుడు పి. వాసు దర్శకత్వం లో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘చంద్రముఖి2’.ఈ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకి సీక్వెల్ గా రూపొందింది.. అప్పట్లో రజనీకాంత్ నటించిన చంద్రముఖి క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. దీనితో చంద్రముఖి 2 సినిమాను రజనీకాంత్ తో మరోసారి తెరకెక్కించాలని దర్శకుడు పి. వాసు సూపర్ స్టార్ ను సంప్రదించారట. రజనీకాంత్ ఈ సీక్వల్ పై అంతగా ఆసక్తి చూపించకపోవడం తో ఈ మూవీ రాఘవ లారెన్స్ వద్దకు చేరింది. హారర్ సినిమాలను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసే రాఘవ లారెన్స్ కు ఈ సినిమా లో హీరో గా నటిస్తున్నారు.

అలాగే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ చిత్రం లో టైటిల్ పాత్ర పోషిస్తుంది.ఈ చిత్రాన్నిఅగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీత అందిస్తున్నారు..అలాగే ఆర్‌.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.ఈ సినిమా వినాయక చవితి కానుక గా విడుదల కానుంది.అలాగే పాన్ ఇండియా స్థాయి లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహిస్తున్నారు.అయితే ఈరోజు చెన్నైలో ని జిప్పియర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చంద్రముఖి2 ఆడియో లాంఛ్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ హాజరైంది. ఈ సందర్భంగా కంగనా రనౌత్ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. కంగనా రనౌత్ హెవీ ఎంబ్రాయిడింగ్ కలిగిన లెహంగా, వోణీలో మెరిసింది. ట్రెడిషనల్ వేర్ లో కంగనా రనౌత్ మరింత అందంగా కనిపించింది.. పైగా ఆకర్షణీయమైన జ్యూవెల్లరీ ధరించడం తో ఈ భామ లుక్ అదిరిపోయింది.ఈవెంట్ లో అందరి చూపు తనపైనే.. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి.

Exit mobile version